Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌-నీల్‌ మూవీ ఇంటర్వెల్‌ కథ ఇది..!

సినిమా గురించి వస్తున్న ఒకొక్క వార్త సినిమా స్థాయిని పెంచుతూనే ఉంది. ఆ మధ్య ఒక భారీ యాక్షన్‌ సీన్‌ కోసం వేసిన సెట్‌ గురించి ఆసక్తికర చర్చ జరిగింది.

By:  Tupaki Desk   |   23 Jun 2025 12:59 PM IST
ఎన్టీఆర్‌-నీల్‌ మూవీ ఇంటర్వెల్‌ కథ ఇది..!
X

ఎన్టీఆర్‌ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు.. ముఖ్యంగా యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు 'డ్రాగన్‌' సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్‌, సలార్ వంటి ఇండియాస్ బిగ్గెస్ట్‌ యాక్షన్ చిత్రాలను అందించిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావడంతో డ్రాగన్‌ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో కొమురం భీం వంటి పాత్రను అద్భుతంగా పోషించి పాన్‌ ఇండియా రేంజ్‌లో స్టార్‌డం దక్కించుకున్న ఎన్టీఆర్‌ ఈ సినిమాలో నటించడంతో ఆ అంచనాలు అనేవి మరింతగా పెరిగాయి, ఎన్టీఆర్‌-నీల్‌ కాంబో మూవీ ప్రకటించినప్పటి నుంచి ఆసక్తి పెరుగుతూనే ఉంది.

సినిమా గురించి వస్తున్న ఒకొక్క వార్త సినిమా స్థాయిని పెంచుతూనే ఉంది. ఆ మధ్య ఒక భారీ యాక్షన్‌ సీన్‌ కోసం వేసిన సెట్‌ గురించి ఆసక్తికర చర్చ జరిగింది. అంతే కాకుండా ఒక యాక్షన్‌ సీన్‌ కోసం ఏకంగా రెండు వేల మంది జూనియర్‌ ఆర్టిస్టులను, ఫైటర్స్‌ను రంగంలోకి దించారనే వార్తలు వచ్చాయి. ఇలా యాక్షన్ సీన్స్ గురించి ఎప్పటికప్పుడు వస్తున్న వార్తలు అందరి దృష్టిని ఆకర్షించడం మాత్రమే కాకుండా డ్రాగన్‌ స్థాయిని పెంచుతూ వస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్‌-నీల్‌ మూవీలోని ఇంటర్వెల్‌ సీక్వెన్స్ గురించి ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా కన్నడ సినీ వర్గాల నుంచి ఈ విషయమై విశ్వసనీయ సమాచారం అందుతోంది. మామూలుగా ఉండదని వారు అంటున్నారు.

ఇంటర్వెల్‌ కి ముందు వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌లో మార్షల్‌ ఆర్ట్స్ నిపుణులను ఉపయోగిస్తున్నారు. అత్యధికంగా నిజమైన మార్షల్‌ ఆర్ట్స్ ఆర్టిస్టులను ఈ సినిమా కోసం రంగంలోకి దించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో వచ్చే ఫైట్‌ సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. కేవలం సినిమాకి మాత్రమే కాకుండా మొత్తం ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఆ ఫైట్‌ స్పెషల్‌గా నిలువబోతుందట, అంతే కాకుండా రాబోయే రోజుల్లో ఆ మార్క్‌ ఫైట్స్‌ను ఫిల్మ్‌ మేకర్స్‌ కాపీ కొట్టడం లేదా ఇన్సిపిరేషన్‌గా తీసుకోవడం జరగడం పక్కా అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు, కన్నడ మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సలార్‌ సినిమా తర్వాత ప్రశాంత్‌ నీల్‌ వెంటనే డ్రాగన్‌ మొదలు పెట్టాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది. వీరిద్దరి కాంబోలో చాలా కాలం క్రితం సినిమా రావాల్సి ఉన్నా వాయిదా పడుతూ వచ్చింది. ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో సినిమా కచ్చితంగా అన్ని విధాలుగా బాగుంటుందని, పూర్తి స్థాయిలో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ స్వేచ్చగా సినిమాను రూపొందించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌ వారు భారీ మొత్తం ఖర్చు చేసి రూపొందిస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు ఎన్టీఆర్‌ తన బాలీవుడ్‌ ఎంట్రీ మూవీ వార్‌ 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హృతిక్‌ రోషన్‌ హీరోగా నటించిన వార్‌ 2 సినిమా వచ్చే ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక డ్రాగన్‌ మాత్రం వచ్చే ఏడాది సమ్మర్‌ కానుగా విడుదల కాబోతుంది.