దేవర2కు ఆ మార్పులు చేయాల్సిందే
RRR వంటి సంచలన పాన్ ఇండియా మూవీతో ఎన్టీఆర్ వరల్డ్ వైడ్‌గా భారీ పాపులారిటీని దక్కించుకున్నాడు.
By: Tupaki Desk | 4 May 2025 2:30 AMRRR వంటి సంచలన పాన్ ఇండియా మూవీతో ఎన్టీఆర్ వరల్డ్ వైడ్‌గా భారీ పాపులారిటీని దక్కించుకున్నాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ నటనకు ముగ్ధులైన హాలీవుడ్ డైరెక్టర్స్ కొందరు తనతో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నామని కూడా స్టేట్మెంట్‌లు ఇవ్వడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ నటించిన భారీ యాక్షన్ డ్రామా `దేవర`. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించారు. రెండు భాగాలుగా తెరపైకి రానున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకు ముందుకొచ్చింది.
అయితే RRR మ్యాజిక్‌ని మాత్రం రీక్రియేట్ చేయలేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే RRRతో ఎన్టీఆర్ దక్కించుకున్న క్రేజ్‌ని `దేవర` తగ్గించిందని చెప్పక తప్పదు. ఎన్టీఆర్ లాంటి పవర్ హౌస్‌ని `దేవర`లో కొరటాల శి కరెక్ట్‌గా వాడుకోలేదని, ఆడియన్స్‌తో పాటు సగటు సినీ లవర్ కోరుకున్న విధంగా ఎన్టీఆర్‌ని ప్రజెంజ్ చేయడంతో దర్శకుడు కొరటాల ఫెయిల్ అయ్యారని కామెంట్‌లు వినిపించాయి. సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో ఎన్టీఆర్‌ని ప్రజెంట్ చేయకపోవడమే దీనికి ప్రధాన కారణంగా నిలచింది.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న కొరటాల శివ పార్ట్ 2 విషయంలో ఇలాంటి తప్పులకు ఛాన్స్ ఇవ్వకూడదని గట్టిగా ప్లాన్ చేస్తున్నాడట. క్యాస్టింగ్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్న కొరటాల కథని మరింత పవర్‌ఫుల్‌గా మార్చి ఏదీ మిస్సవకుండా తెరపైకి తీసుకురావాలనుకుంటున్నాడట. ఇప్పటికే కథలో భారీ మార్పులు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఆ మార్పులకు తగ్గట్టుగానే క్రేజీ ఆర్టిస్ట్‌లని కూడా రంగంలోకి దించబోతున్నట్టుగా తెలుస్తోంది.
దేవర పార్ట్ 1కు మరింత పవర్ ఫుల్‌గా పార్ట్ 2ని తెరపైకి తీసుకురానున్న కొరటాల శివ రెండవ భాగాన్ని వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళుతున్నారట ఈ విషయాన్ని హీరో కల్యాణ్ రామ్ ఇటీవల వెల్లడించారు. ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై సుధాకర్ మిక్కిలినేని, నందమూరి కల్యాణ్‌రామ్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. అన్ని పక్కా కుదిరిన తరువాత `దేవర పార్ట్ 2`కు సంబంధించిన అప్ డేట్‌ని మేకర్స్ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని తెలిసింది.