RRR ఆస్కార్ కోసం కాదు స్నేహితుడి కోసం
నిజానికి 'నాటు నాటు' కోసం చెమటలు పట్టేలా చాలా శ్రమించాల్సి వచ్చిందని చెప్పిన తారక్, ఆ కష్టాన్నంతా ఆస్కార్ గెలుచుకున్న తర్వాత మర్చిపోయామని అన్నాడు.
By: Tupaki Desk | 13 May 2025 10:26 PM ISTరాయల్ ఆల్బర్ట్ హాల్‌లో 'నాటు నాటు..' ప్రత్యక్ష కచేరీ కోసం చిత్రబృందం లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ వేదికపై చరణ్, తారక్ లతో పాటు మహేష్ బాబు కూడా ప్రత్యక్షమై అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. అదంతా అటుంచితే, ఈ వేదికపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్నేహం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్ లో ట్రెండింగ్ గా మారాయి.
నిజానికి 'నాటు నాటు' కోసం చెమటలు పట్టేలా చాలా శ్రమించాల్సి వచ్చిందని చెప్పిన తారక్, ఆ కష్టాన్నంతా ఆస్కార్ గెలుచుకున్న తర్వాత మర్చిపోయామని అన్నాడు. జక్కన్న హింస గురించి కూడా ఇదే వేదికపై సరదాగా వ్యాఖ్యానించిన ఎన్టీఆర్ .. తన స్నేహితుడు చరణ్ గురించి కూడా మాట్లాడాడు. ఆస్కార్ గెలుచుకోవడం గురించి కాదు.. అద్భుత డ్యాన్సర్ అయిన నా ఫ్రెండ్ తో కలిసి తెరను పంచుకున్నందుకు డ్యాన్స్ చేసినందుకు దీనిని ప్రత్యేక పాటగా గుర్తుంచుకుంటానని తారక్ అన్నాడు.
మొత్తానికి చరణ్ తో బ్రొమాన్స్ గురించి తారక్ మరోసారి లండన్ రాయల్ ఆల్బర్ట్స్ లో గుర్తు చేయడం చర్చనీయాంశమైంది. నిజ జీవితంలో దోస్తులుగా ఉన్న ఆ ఇద్దరూ వెండితెర పాత్రల రూపంలోను దోస్తీ కట్టడం అప్పట్లో గొప్ప చర్చకు తెర లేపింది.
