Begin typing your search above and press return to search.

వార్ 2: తెలుగు మార్కెట్ లో లాభంతోనే..

బాలీవుడ్‌లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వడమే ఒక ఎత్తైతే, వార్ 2 మూవీలో కనిపించడం మరొక ఎత్తు. ఇది ఇండియన్ సినిమా లెవెల్‌లోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది.

By:  M Prashanth   |   29 July 2025 12:56 PM IST
వార్ 2: తెలుగు మార్కెట్ లో లాభంతోనే..
X

బాలీవుడ్‌లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వడమే ఒక ఎత్తైతే, వార్ 2 మూవీలో కనిపించడం మరొక ఎత్తు. ఇది ఇండియన్ సినిమా లెవెల్‌లోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. యశ్ రాజ్ ఫిలిమ్స్ (YRF) నిర్మాణంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలయికకు ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లోనూ భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. స్టార్ పవర్ తో పాటు, ఈ కాంబినేషన్ అందరికీ కొత్తగా అనిపిస్తూ చర్చనీయాంశంగా మారింది.

కాస్టింగ్ పైనే భారీ డిబేట్

YRF వార్ 2 లో ఎన్టీఆర్‌ని హృతిక్ రోషన్ సరసన కాస్ట్ చేయడంపై మొదటిసారి ఇండస్ట్రీలోనే చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. టాప్ తెలుగు హీరో అయిన ఎన్టీఆర్ హిందీ సినిమాకు, అది కూడా నాన్-సోలో లీడ్ పాత్రకు ఎందుకు ఒప్పుకున్నాడు? హృతిక్ ఒక్కరే ఉన్నా ప్రాజెక్ట్‌కు క్రేజ్ ఉండేది, మరి ఎన్టీఆర్ అవసరం ఏంటి? అనే డౌట్స్ వచ్చాయి.

అయితే ప్రస్తుతం ఇదే యష్ రాజ్ ఫిలిమ్స్, ఎన్టీఆర్ ఇద్దరికీ కూడా కలిసొచ్చింది. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి రూ. 60 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారు. ఇది సింగిల్ హీరో రోల్ కాకపోయినా, బడా పేమెంట్ కావడం గమనార్హం. అసలులో, ఇది హృతిక్ రోషన్ రెమ్యునరేషన్ కంటే ఎక్కువ ఆయనకు ఈ మూవీకి రూ. 50 కోట్లు ఇచ్చారట. ఇలా ఎన్టీఆర్ స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకుని, బాలీవుడ్ స్టేజ్ పై తక్కువ సమయంలోనే హై లెవెల్ ఎంట్రీ ప్లాన్ చేశారు.

YRFకు భారీగా లాభాలు

కాస్టింగ్ మారిపోయినా, ఎకానమీనీ అనుసరిస్తే ఎలాంటి లాభాలు వస్తాయో వార్ 2 లో స్పష్టమైంది. ఎన్టీఆర్ ఉండటంతో ఈ మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్ ను ప్రొడ్యూసర్ నాగ వంశీకి ఏకంగా రూ. 80 కోట్లకు అమ్మింది YRF. ఈ లెక్కన ఎన్టీఆర్ రెమ్యునరేషన్ రూ. 60 కోట్లు మైనస్ చేస్తే కూడా, ప్రాజెక్ట్ రిలీజ్ కంటే ముందే తెలుగు మార్కెట్ నుంచే రూ. 20 కోట్ల నికర లాభాన్ని వసూలు చేసింది.

దీంతో పాటు, ఎన్టీఆర్‌కు అమెరికాలో కూడా స్ట్రాంగ్ మార్కెట్ ఉంది. అక్కడ హృతిక్ కి ఉన్న క్రేజ్ తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా తోడైతే సినిమాకు ఆయన వలన అదనంగా 2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 10 కోట్లు) అదనపు వసూళ్లు రావచ్చు, మొత్తం లాభం రూ. 30 కోట్లకు చేరే అవకాశం ఉంది. అంటే బాలీవుడ్ స్టూడియోగా YRF ఎప్పుడూ లేనంతగా తెలుగు హీరోతో భారీ రేంజ్ మార్కెట్‌ను వాడుకున్నారు.

ఎన్టీఆర్‌ వల్లే తెలుగులో రికార్డ్ బిజినెస్

మల్టీ స్టారర్ మూవీ కోసం తెలుగు డిస్ట్రిబ్యూటర్ నుంచి ఈ రేంజ్‌లో మార్కెట్, ఇప్పటివరకు రాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్‌ను కాకుండా మరొక బాలీవుడ్ యాక్టర్‌ను తీసుకుని ఉంటే, తెలుగు మార్కెట్ నుంచి ఈ స్థాయిలో డీల్ సాధ్యం కాదని స్పష్టమవుతోంది. ఇదే వాస్తవాన్ని ఇప్పుడు బిజినెస్ ఫలితాలే చెప్పేస్తున్నాయి. ఇలా చూస్తే, బాలీవుడ్‌లో ఎన్టీఆర్ ఎంట్రీ కేవలం పాన్ ఇండియా స్టార్డమ్ మాత్రమే కాదు… వర్క్ కమర్షియల్ మోడల్‌ను, ఇతర స్టూడియోలు కూడా ఇలాంటి స్ట్రాటజీ ప్లాన్ చేయొచ్చని ప్రూవ్ చేసేసింది. వార్ 2 రిజల్ట్ ఏదైనా, ఎన్టీఆర్ తీసుకున్న రిస్క్ YRF పెట్టిన పెట్టుబడికి ముందు నుంచే రెవెన్యూ జనరేట్ అయ్యింది. ఇక సినిమా కంటెంట్ ఏ స్థాయిలో క్లిక్కవుతుందో చూడాలి.