Begin typing your search above and press return to search.

వార్‌ 2... బాబు బర్త్‌డేకి పెద్దగానే!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లో 'వార్‌ 2' సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   16 May 2025 11:07 AM IST
Double Surprise for NTR Fans: War 2 & Prashanth Neel Updates on May 20
X

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లో 'వార్‌ 2' సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో కొమురం భీమ్‌ పాత్రలో నటించడం ద్వారా పాన్‌ ఇండియా రేంజ్‌లో స్టార్‌డం దక్కించుకున్న ఎన్టీఆర్‌ ఆ మధ్య వచ్చిన దేవర సినిమాతోనూ హిందీ ప్రేక్షకులను మెప్పించాడు. తన డాన్స్‌, యాక్టింగ్‌తో నార్త్‌ ఇండియాలోనూ అభిమానులను ఏర్పర్చుకున్న ఎన్టీఆర్‌ ఇప్పుడు నేరుగా హిందీ సినిమాలో నటించడంతో అంచనాలు భారీగా పెరిగాయి. పైగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్‌ 'వార్‌ 2' సినిమాలో నటిస్తున్న కారణంగా అంచనాలు మరింత పెరిగి పోయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో వార్‌ 2 ఫస్ట్‌ లుక్‌ కోసం ఫ్యాన్స్‌ కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు.

వార్ 2 సినిమాను ఈ ఏడాది ఆగస్టులోనే విడుదల చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు ఫస్ట్‌లుక్ విడుదల చేయక పోవడం పట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ వార్‌ 2 అప్‌డేట్‌ కోసం దాదాపు ఏడాది కాలంగా వెయిట్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు కనీసం ఎన్టీఆర్‌ లుక్‌ ఎలా ఉంటుంది అనేది కూడా లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు. అందుకే ఫస్ట్‌ లుక్ విషయమై చాలా ఆసక్తి ఉంది. ఎట్టకేలకు ఎన్టీఆర్‌ వార్ 2 లుక్‌ రివీల్‌కి ముహూర్తం ఖరారు అయింది. ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా మే 20న వార్ 2 నుంచి స్పెషల్‌ సర్‌ప్రైజింగ్‌ వీడియోతో పాటు పోస్టర్‌ కూడా రాబోతుందని బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా నుంచి కూడా అప్డేట్‌ రాబోతుంది. ప్రశాంత్‌ నీల్ మూవీ షూటింగ్‌ ఇటీవలే ప్రారంభం అయింది. కనుక పోస్టర్‌ విడుదల చేసే అవకాశం ఉంది. గ్లిమ్స్ వీడియోను షేర్‌ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రశాంత్ నీల్‌ బర్త్‌డే కానుకగా ఏం ప్లాన్‌ చేస్తున్నాడు అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి ఎన్టీఆర్‌ బర్త్‌డేకి కచ్చితంగా వార్ 2 నుంచి ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో పాటు, ప్రశాంత్‌ నీల్‌ సినిమా నుంచి సాలిడ్ అప్‌డేట్‌ కన్ఫర్మ్‌ అయింది. మొత్తానికి ఎన్టీఆర్‌ బర్త్‌డేకి భారీగానే సందడి ఉంటుందని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వార్‌ 2 సినిమాలో హృతిక్‌ రోషన్ హీరోగా నటించగా, ఎన్టీఆర్‌ విలన్‌ రోల్‌లో కనిపించబోతున్నాడనే వార్తలు వచ్చాయి. ఆ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ప్రముఖ హీరోయిన్‌ ఈ సినిమాలో ప్రత్యేక పాటలో కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ రాలేదు. బాలీవుడ్‌ లో ప్రస్తుతం సౌత్‌ హీరోల సందడి, సత్తా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో వార్‌ 2 సినిమాతో ఎన్టీఆర్ కచ్చితంగా మరోసారి తెలుగోడి సత్తా నార్త్‌ ఇండియాలో చూపించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల వారు, అభిమానులు నమ్మకంగా ఉన్నారు.