Begin typing your search above and press return to search.

మోదీ తర్వాత స్థానం తారక్ దే!

సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఆర్మాక్స్ మీడియా సంస్థ ఎలా అయితే సర్వే నిర్వహిస్తుందో.. ఇప్పుడు ట్విట్టర్ వేదికగా అత్యధికంగా చర్చించుకున్న ప్రముఖుల జాబితా కూడా ట్విట్టర్ రిలీజ్ చేసింది.

By:  Madhu Reddy   |   2 Sept 2025 8:53 PM IST
మోదీ తర్వాత స్థానం తారక్ దే!
X

సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఆర్మాక్స్ మీడియా సంస్థ ఎలా అయితే సర్వే నిర్వహిస్తుందో.. ఇప్పుడు ట్విట్టర్ వేదికగా అత్యధికంగా చర్చించుకున్న ప్రముఖుల జాబితా కూడా ట్విట్టర్ రిలీజ్ చేసింది. దీంతో ఈ లిస్ట్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతోంది.ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దేశం మొత్తంలో అత్యధికంగా చర్చించుకున్న వ్యక్తులలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరువాత దక్షిణాది హీరో తారక్ స్థానాన్ని సంపాదించుకోవడం ఆశ్చర్యంగా మారింది.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

మోదీ తర్వాత స్థానంలో ఎన్టీఆర్..

అసలు విషయంలోకి వెళ్తే.. ట్విట్టర్ వేదికగా ఆగస్టు నెలలో అత్యధికంగా చర్చించుకున్న ప్రముఖుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రథమ స్థానంలో నిలిచారు. జూలైలో మూడవ స్థానంలో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు తాజాగా రెండవ స్థానాన్ని చేరుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ట్విట్టర్ డేటా ప్రకారం ఇండియాలోని యూజర్ల పోస్ట్స్ నంబర్ ను పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకులు ఇవ్వడం జరిగింది.

టాప్ టెన్ జాబితా ఇదే..

మొదటి స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ నిలవగా.. రెండవ స్థానంలో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ నిలిచారు. మూడవ స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి స్థానాన్ని దక్కించుకున్నారు. నాలుగవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ డీసీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలవగా.. ఐదవ స్థానంలో ప్రముఖ క్రికెటర్ శుభమన్ గిల్ స్థానం సంపాదించుకున్నారు. ఆరవ స్థానంలో రాహుల్ గాంధీ, ఏడవ స్థానంలో విరాట్ కోహ్లీ, ఎనిమిదవ స్థానంలో మహేష్ బాబు, 9వ స్థానంలో ఎంఎస్ ధోని, 10వ స్థానంలో రజనీకాంత్ స్థానాలను దక్కించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా దేశంలో అత్యధికంగా చర్చించుకున్న సెలబ్రిటీలలో మోదీ తర్వాత స్థానం తారక్ సంపాదించుకోవడం నిజంగా ప్రశంసనీయమని చెప్పాలి.

వార్ 2 తోనే సాధ్యం..

ఇకపోతే టాలీవుడ్ స్టార్ హీరో తారక్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిని అందుకున్న ఈయన.. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేసి సైలెంట్ గా 600 కోట్ల క్లబ్లో చేరిపోయారు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. మరొకవైపు బాలీవుడ్లోకి తొలి సినీ రంగ ప్రవేశం చేస్తూ హృతిక్ రోషన్ తో చేసిన చిత్రం వార్ 2 . ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కారణంగానే ఇటు సౌత్ లోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా ఈయన గురించి ఎక్కువగా చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు నెల మొత్తంలో తారక్ గురించి చర్చ ఎక్కువగా జరగడం గమనార్హం. అందుకే ఏకంగా మోడీ తర్వాత స్థానాన్ని దక్కించుకోవడానికి ఇది కూడా ఒక కారణం అని తెలుస్తోంది.