అభిమానిని తలచి తారక్ ఎమోషనల్
''13 సంవత్సరాల క్రితం బాద్ షా ఫంక్షన్ జరిగినప్పుడు వరంగల్ కి చెందిన ఒక అభిమాని ప్రాణాల్ని కోల్పోయాడు.
By: Sivaji Kontham | 11 Aug 2025 9:20 AM ISTఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్ 2 ఆగస్టు 14న అత్యంత భారీగా విడుదలవుతోంది. తాజాగా ప్రీరిలీజ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ సందడి చేసారు. ఆ ఇద్దరి స్పీచ్ ఆద్యంతం అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా తారక్ మాట్లాడుతూ తాను బాద్ షా వేడుక సమయంలో అభిమానిని కోల్పోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
''13 సంవత్సరాల క్రితం బాద్ షా ఫంక్షన్ జరిగినప్పుడు వరంగల్ కి చెందిన ఒక అభిమాని ప్రాణాల్ని కోల్పోయాడు. తొక్కిసలాట కారణంగా అలా జరిగింది. ఆరోజు నుంచి పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉన్నాను. 25 వసంతాలు పూర్తయిన సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవాలనే ఆత్రం నాకు ఉంది. ఈ సమయంలో నన్ను వంశీ కూడా బలవంతం చేసాడు. ఈ వేడుకను ఇంత భారీగా నిర్వహించాడు. అతడు నన్ను కూడా ఫోర్స్ చేసేలా చేసిన మీ అందరికీ థాంక్స్'' అని అన్నారు.
వార్ 2 చిత్రం నేను చేయడానికి ముఖ్య కారణం ఏమిటో కూడా తారక్ మాట్లాడారు. నిర్మాత ఆదిత్య చోప్రా వెంటపడటం వల్ల ఈ సినిమాకి ఓకే చెప్పానని అన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో కథ, కథన బలం ఇవన్నీ పక్కన పెడితే నన్ను ఈ చిత్రంలో నటించాలని పట్టుబట్టిన ఆదిత్య చోప్రాను మర్చిపోలేను. నువ్వు ఈ మూవీ చేయాలి అని నా వెంటపడి వెంటపడి, నాకు భరోసాను కల్పించి, మీ అభిమానులు గర్వంగా తలెత్తుకునేలాగా నేను ఈ చిత్రాన్ని రూపందిస్తాను.. నన్ను నమ్ము! అని చెప్పిన ఆదిత్యా చోప్రా చెప్పారు`` అని తెలిపారు. ఆయన మాట వినకుండా లేదా నమ్మకుండా ఉంటే ఈరోజు ఇది జరిగేది కాదు. ఇంత ధైర్యం గా మీ ముందు నిలిచేవాడిని కాదు. నాకు నమ్మకాన్ని భరోసాను ఇచ్చినందుకు ఆదిత్య సర్ కి థాంక్యూ. యష్ రాజ్ ఫిలింస్ స్టాఫ్ అందరికీ థాంక్స్. చాలా మంది ఈ సినిమా కోసం పని చేసారు. కథానాయిక రాణీ ముఖర్జీ సోదరుడు రాజా ముఖర్జీకి ధన్యవాదాలు అని తెలిపారు.
నిజానికి నాకు బొంబాయి అంతగా ఇష్టం ఉండదు. అలాంటిది 76 రోజుల పాటు షూటింగ్ చేస్తున్నంత సేపు నాకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంది వైఆర్ఎఫ్. నాకు కష్టం అన్నదే లేకుండా చూసుకున్నారు. హైదరాబాద్ లో ఉన్నట్టే అనిపించింది. అంతటి సౌకర్యం ఇచ్చిన వైఆర్ఎఫ్ బృందానికి ధన్యవాదాలు. నేను 76 రోజులు షూటింగ్ చేసాను. హృతిక్ సర్ నుంచి చాలా నేర్చుకున్నాను. నేను బాలీవుడ్ లో ఎలా అడుగుపెడుతున్నానో అలాగే తెలుగులో హృతిక్ కూడా అడుగుపెడుతున్నాడని మీరు భావించాలని తన అభిమానులకు సూచించారు తారక్. వార్ 2 లో ఎన్నో ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులన్నీ చూసినా కానీ మీరు బయటకు లీక్ చేయొద్దని కూడా తారక్ అభ్యర్థించారు.
