Begin typing your search above and press return to search.

పుష్ప రాజ్ క్రేజ్ తో మరో ఆటగాడు.. వ్వాటే క్రేజ్!

టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌కి సంబంధించిన ఓ ఆర్ట్‌పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో జొకోవిచ్ అల్లు అర్జున్ స్టైల్‌లో ‘ జూకేగా నహీ’ అంటూ ముద్ర వేస్తున్న స్టిల్స్ ఉన్నాయి.

By:  Tupaki Desk   |   1 July 2025 4:21 PM IST
పుష్ప రాజ్ క్రేజ్ తో మరో ఆటగాడు.. వ్వాటే క్రేజ్!
X

పుష్ప సినిమా సిరీస్‌తో ఇండియన్ సినిమా మరొకసారి తన మాస్ సత్తా ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పింది. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్రాంచైజీ మొదటి భాగంతోనే సంచలనం సృష్టించింది. రెండో భాగం ‘పుష్ప 2: ది రూల్’ మాత్రం అంచనాలను మరింత అధిగమిస్తూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను సృష్టించింది.

ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసిన ఈ చిత్రం, టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. సినిమాలో మాస్ ఎలివేషన్స్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు అన్నీ కలిసొచ్చి ‘పుష్ప 2’ సినిమాను ఓ ఘనవిజయంగా నిలబెట్టాయి. విడుదలైన ప్రతి చోటా థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించాయి.

దేశంలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ సినిమా అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూకేలోకి వెళ్లిన ఈ సినిమా రికార్డుల వర్షం కురిపించింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన ‘జూకేగా నహీ’ డైలాగ్‌తో పాటు అల్లు అర్జున్ స్టెప్పులు యూట్యూబ్ షార్ట్ లు, రీల్స్‌లో కోట్ల వ్యూస్‌ను రాబట్టాయి.

ఇప్పటికే పుష్ప మేనియా ఎంత స్ట్రాంగ్‌గా ఉందో చెప్పేందుకు తాజా ఉదాహరణ వింబుల్డన్‌లో కనిపించింది. టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌కి సంబంధించిన ఓ ఆర్ట్‌పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో జొకోవిచ్ అల్లు అర్జున్ స్టైల్‌లో ‘ జూకేగా నహీ’ అంటూ ముద్ర వేస్తున్న స్టిల్స్ ఉన్నాయి. ఈ చిత్రాన్ని పుష్ప మూవీ అధికారిక ట్విట్టర్ ఖాతా కూడా పోస్ట్ చేయడంతో మజా రెట్టింపు అయింది.

అంతేకాదు, వింబుల్డన్ అధికారిక అకౌంట్ నుంచే దీన్ని పోస్ట్ చేయడం విశేషం. ప్రపంచంలోని అత్యుత్తమ టెన్నిస్ ఛాంపియన్ ఒకడు ఈ మేనియాలో భాగమవడం పుష్ప క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా చూపుతోంది. ఇంకా ఈ మేనియాను మరింతగా పెంచేలా మూవీ మేకర్స్ ముందే ప్రకటించిన విషయం ఏంటంటే… ‘పుష్ప 3’ కూడా రాబోతోందన్న సంగతి. సుకుమార్ దర్శకత్వంలో మూడో భాగం స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే మొదలైంది.

రెండేళ్ల అనంతరం సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈసారి పుష్ప తన యూనివర్స్‌ను మరింత విస్తృతంగా చూపించబోతున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఫ్రాంచైజీపై భారీగా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. పుష్ప 2 సాధించిన ఘనవిజయం వాళ్ళను మరింత నమ్మకంగా మార్చింది. ఇకపోతే, పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌కు వచ్చిన పాన్ ఇండియా క్రేజ్‌కి ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు కూడా జతకావడంతో, ఇండియన్ సినిమా మరోసారి ఊహించని స్థాయిలో ఉన్నట్లు చాటుకుంటోంది.