Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్: మళ్ళీ అప్సెట్ చేసిన శంకర్!

గేమ్ చేంజర్ మూవీ నుంచి ఇప్పటి వరకు పోస్టర్స్ తప్ప అంతకు మించిన అప్డేట్ ఏమీ కూడా శంకర్ ఇవ్వలేదు.

By:  Tupaki Desk   |   16 Aug 2023 4:41 AM GMT
గేమ్ ఛేంజర్: మళ్ళీ అప్సెట్ చేసిన శంకర్!
X

సౌత్ ఇండియన్ స్టార్ దర్శకుడు శంకర్ ప్రస్తుతం రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకేసారి చేస్తున్నారు. తమిళంలో కమల్ హాసన్ తో ఇండియన్ 2 మూవీ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. అలాగే తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీకి సంబందించి కీలక ఎపిసోడ్స్ రీసెంట్ గా కంప్లీట్ చేశారు. గేమ్ చేంజర్ మూవీని దిల్ రాజు ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.


ఇండియన్ 2 మూవీ లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్స్ సంయుక్తంగా 300 కోట్ల బడ్జెట్ ట్ నిర్మిస్తున్నాయి. గేమ్ చేంజర్ మూవీ నుంచి ఇప్పటి వరకు పోస్టర్స్ తప్ప అంతకు మించిన అప్డేట్ ఏమీ కూడా శంకర్ ఇవ్వలేదు. షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే మెజారిటీ షూటింగ్ పార్ట్ ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది. అయిన కూడా శంకర్ నుంచి మూవీ టీజర్, గ్లింప్స్ లాంటివి రావడం లేదు.

ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్యతో చరణ్ కి బిగ్గెస్ట్ డిజాస్టర్ వచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ మంచి ఆకలి మీద ఉన్నారు. వారు రామ్ చరణ్ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ ని గేమ్ చేంజర్ తో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో మూవీ ఎలా ఉండబోతోందనేది క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏదైనా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తే మూవీపై ఒక అంచనాకి రావొచ్చని భావిస్తున్నారు.

అయితే శంకర్ మాత్రం ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నారు. ఇండిపెండెంట్స్ సందర్భంగా ఇండియన్ 2 నుంచి ఒక పోస్టర్ ని రిలీజ్ చేసి విషెస్ చెప్పారు. కనీసం అలాంటి అప్డేట్ కూడా గేమ్ చేంజర్ నుంచి లేకపోవడం కొంత నిరుత్సాహానికి గురయ్యారని చెప్పొచ్చు. అయితే ఇండియన్ 2 పోస్టర్ కూడా అంత గొప్పగా ఏమీ లేదు. భారతీయుడి గెటప్ లో కమల్ హాసన్ లుక్ మాత్రమే పోస్టర్ లో ఉంది.

ఏది ఏమైనా శంకర్ మాత్రం రామ్ చరణ్ కి సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇస్తాడనే నమ్మకంతోనే ఫ్యాన్స్ ఉన్నారు. ఈ చిత్రంలో కీయరా అద్వానీ, అంజలి హీరో, హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. సముద్రఖని పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు.