Begin typing your search above and press return to search.

సలార్ మాత్రమే కాదు.. OG కూడా అంతే..

ఇదిలా ఉంటే ప్రభాస్ 'సలార్', పవన్ కళ్యాణ్ OG సినిమాలకు సంబంధించి ఎంట్రీ సీన్స్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.

By:  Tupaki Desk   |   3 Dec 2023 11:50 AM GMT
సలార్ మాత్రమే కాదు.. OG కూడా అంతే..
X

అగ్ర హీరోల సినిమాల్లో ఇంట్రడక్షన్ సీన్స్ కి ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో హీరోల కోసం ఓ రేంజ్ లో ఎలివేషన్స్, అదిరిపోయే బీజీయం తో ఎంట్రీ సీన్స్ ప్లాన్ చేస్తుంటారు దర్శకనిర్మాతలు. వాటికి థియేటర్స్ లో ఫ్యాన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి హీరోల అప్ కమింగ్ మూవీస్ లో ఎంట్రీ సీన్స్ ఎలా ఉంటాయో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

ఇదిలా ఉంటే ప్రభాస్ 'సలార్', పవన్ కళ్యాణ్ OG సినిమాలకు సంబంధించి ఎంట్రీ సీన్స్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే, సలార్, OG.. ఈ రెండు సినిమాల్లో హీరో ఎంట్రీ ఆలస్యంగా ఉంటుందట. కానీ ఎంట్రీ ఇచ్చాక మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. తాజాగా రిలీజ్ అయిన సలార్ ట్రైలర్ ని గమనిస్తే..

సినిమాలో ప్రభాస్ ఎంట్రీ ఆలస్యంగా ఉంటుందని అర్థమవుతుంది. సలార్ ట్రైలర్ 3 నిమిషాల 47 సెకండ్ల నిడివితో విడుదలవ్వగా ట్రైలర్ లో దాదాపు రెండు నిమిషాల వరకు ప్రభాస్ ఎక్కడా కనిపించలేదు. ఈ విషయంలో ఫ్యాన్స్ కొంత అసంతృప్తి చేశారు. కానీ ట్రైలర్లో ప్రభాస్ కనిపించిన తర్వాత నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. అలా సలార్ తో పాటు పవన్ కళ్యాణ్ OG సినిమాలోనూ హీరో ఎంట్రీ ఆలస్యంగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా ఈ రెండు సినిమాలపై ఇండస్ట్రీలో ఇలాంటి హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలాకాలం తర్వాత సలార్ తో యాక్షన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రభాస్. గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న ప్రభాస్ సలార్ తో భారీ కం బ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ అందుకోవడం తోపాటు సినిమాపై అంచనాలను పెంచేసింది.

డిసెంబర్ 22న సలార్ థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇక పవర్ స్టార్ OG విషయానికొస్తే, గ్యాంగ్ స్టార్, మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం. ఇది సాహో మూవీ ఫేమ్ సుజిత్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.