Begin typing your search above and press return to search.

'ఈగల్'.. సోలో డేట్ దొరికేలా లేదు

దాని ప్రకారం ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు అదే డేట్ క్ఈ యంగ్ హీరో సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' సినిమా రిలీజ్ కాబోతోంది.

By:  Tupaki Desk   |   21 Jan 2024 8:44 AM GMT
ఈగల్.. సోలో డేట్ దొరికేలా లేదు
X

తెలుగు సినీ పరిశ్రమ బావుండాలి, తన సినిమా వల్ల తోటి సినిమాలకు ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో మాస్ మహారాజ రవితేజ 'ఈగల్' సినిమా రిలీజ్ ని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి మొత్తం ఐదు సినిమాలు పోటీలో ఉంటే దిల్ రాజు నిర్మాతలు అందరితో కూలంకషంగా చర్చించి 'ఈగల్' సినిమాని రేసు నుంచి తప్పించారు. అంతే కాకుండా 'ఈగల్' కి కచ్చితంగా సోలో రిలీజ్ డేట్ ఇస్తామని హామీ ఇచ్చారు.

దాని ప్రకారం ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు అదే డేట్ క్ఈ యంగ్ హీరో సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' సినిమా రిలీజ్ కాబోతోంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ ఫేమ్ వీఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ నిర్మిస్తున్నారు. AK ఎంటర్టైన్మెంట్స్ సమర్పిస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుని సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఇదిలా ఉంటే ఈగల్ కంటే ముందే ఫిబ్రవరి 9 కి 'ఊరు పేరు భైరవకోన, టిల్లు స్క్వేర్ సినిమాలు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. కట్ చేస్తే.. అదే డేట్ కి 'ఈగల్' నిర్మాతలు సినిమా రిలీజ్ ని ఫిక్స్ చేశారు. దాంతో అప్పటికే రిలీజ్ రెడీగా ఉన్న 'టిల్లు స్క్వేర్‌' వాయిదా వేసుకుంది. కానీ సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన మాత్రం రవితేజతో పోటీకి దిగేందుకు సిద్ధమైంది.

ఫిలిం ఛాంబర్ 'ఈగల్' కి సోలో రిలీజ్ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ 'ఊరు పేరు భైరవకోన' మూవీ నిర్మాత రాజేష్ దండ తమ సినిమాని ఫిబ్రవరి 9న విడుదల చేస్తున్నట్లు మరోసారి కన్ఫామ్ చేయడంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉండబోతుందని స్పష్టమవుతోంది. దాంతో ఫిలిం ఛాంబర్ ఈగల్ రిలీజ్ విషయంలో మాట నిలబెట్టుకోలేక పోయిందని పలువురు చెబుతున్నారు.

కాగా ఊరు పేరు భైరవకోన ట్రైలర్ రిలీఫ్ సందర్భంగా ప్రెస్ మీట్ లో సందీప్ కిషన్ సైతం ఇదే విషయం గురించి మాట్లాడుతూ.." తమ సినిమాని ముందు సంక్రాంతికి అనుకున్నప్పటికీ ఆ సమయంలో ఎక్కువగా ఉండడంతో వద్దనుకుని ఫిబ్రవరి 9 డేట్ కి టిల్లు స్క్వేర్ టీంతో మాట్లాడి రిలీజ్ అనౌన్స్ చేశాము. రవితేజ గారితో, పీపుల్స్ మీడియా వాళ్ళతో మాకు మంచి అనుబంధం ఉంది. కానీ ఇప్పుడు మేమున్న పరిస్థితిలో రిలీజ్ డేట్ మార్చుకోలేం" అని అన్నాడు.