Begin typing your search above and press return to search.

ఆ బిగ్ సినిమాకు సీక్వెల్ లేనట్లే… తేల్చేసిన అట్లీ

రిలీజ్ అయిన అన్ని భాషలలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ బొమ్మగా నిలిచింది.

By:  Tupaki Desk   |   26 Feb 2024 3:36 AM GMT
ఆ బిగ్ సినిమాకు సీక్వెల్ లేనట్లే… తేల్చేసిన అట్లీ
X

షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో గత ఏడాది వచ్చి బ్లాక్ బస్టర్ అయిన మూవీ జవాన్. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. రిలీజ్ అయిన అన్ని భాషలలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ బొమ్మగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 1100 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసింది.

పఠాన్ ని దాటిపోయి గత ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో నయనతార బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. విజయ్ సేతుపతి విలనీగా మెప్పించాడు. సౌత్ యాక్టర్స్ ఈ చిత్రంలో ఎక్కువ మందే కనిపించారు. మరల షారుఖ్, అట్లీ కలయికలో జవాన్ 2 కూడా ఉంటుందనే ప్రచారం గత కొంతకాలంగా నడుస్తోంది.

ఇప్పుడు ఆ వార్తలకి అట్లీ ఫుల్ స్టాప్ పెట్టాడు. తనకి షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం అని, అతనితో సినిమా చేయాలనే తన డ్రీం ఫుల్ ఫీల్ అయ్యిందని అన్నారు. షారుఖ్ గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. సెట్ లో నిత్యం ఉత్సాహంగా ఉండటంతో పాటు అందరిని కూడా అలాగే ఉంచుతారని అన్నారు. షారుఖ్ ఖాన్ తో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతున్న అని తెలిపారు.

జవాన్ కంటే గొప్ప కథ దొరికినపుడు కచ్చితంగా షారుఖ్ తో కలిసి సినిమా చేస్తానని అట్లీ చెప్పుకొచ్చాడు. దీనిని బట్టి జవాన్ కి సీక్వెల్ లేదని స్పష్టం అయిపొయింది. అయితే గత ఏడాది జనవరిలో షారుఖ్ ఖాన్ నుంచి వచ్చి సూపర్ హిట్ అయిన పఠాన్ కి మాత్రం సీక్వెల్ ప్లానింగ్ ఉందంట. సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలోనే పఠాన్ 2 సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

అలాగే పఠాన్ వెర్షన్ టైగర్ కూడా యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో ప్లానింగ్ ఉంది. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది తెలియాలి. అట్లీ ఇప్పట్లో మళ్ళీ బాలీవుడ్ సినిమా చేసే అవకాశం అయితే లేదని అతని మాటల బట్టి స్పష్టం అవుతుంది. నెక్స్ట్ సినిమాపై అతను ఎప్పుడు క్లారిటీ ఇస్తాడనేది చూడాలి.