Begin typing your search above and press return to search.

పుష్ప 2.. అక్కడ కూడా మంచి బేరమే..

ఇక నార్త్ అమెరికాలో కూడా ఊహించని స్థాయిలో సినిమాకు మంచి డీల్ సెట్ అయినట్లు సమాచారం. ప్రత్యాంగిరా సినిమాస్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ పుష్ప 2 నార్త్ అమెరికా రైట్స్ సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   30 April 2024 8:48 AM GMT
పుష్ప 2.. అక్కడ కూడా మంచి బేరమే..
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న పుష్ప సెకండ్ పార్ట్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫస్ట్ పార్ట్ కంటే ఈసారి రెండో భాగంతో అంతకుమించి అనేలా బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్రేక్ చేస్తారు అని ఫ్యాన్స్ అయితే గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమాను అంచనాలకు తగ్గట్టుగా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్లోనే నిర్మిస్తోంది.

ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా యాక్షన్ సన్నివేశాలను సాలిడ్ గానే రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రోజుకొకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కూడా ఓ వర్గం ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రమోషన్స్ లో కూడా దమ్ము చూపించాలి అని మేకర్స్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.

సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ కూడా చాలా వరకు క్లోజ్ అయ్యాయి. ఓవర్సీస్ లో కూడా పుష్ప రాజ్ కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక ఈ సినిమాకు నార్త్ అమెరికాలో కూడా మంచి డీల్ సెట్ అయినట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో బిజినెస్ చేస్తున్న సినిమాగా పుష్ప సెకండ్ పార్ట్ రికార్డులు క్రియేట్ చేస్తోంది.

ఇక నార్త్ అమెరికాలో కూడా ఊహించని స్థాయిలో సినిమాకు మంచి డీల్ సెట్ అయినట్లు సమాచారం. ప్రత్యాంగిరా సినిమాస్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ పుష్ప 2 నార్త్ అమెరికా రైట్స్ సొంతం చేసుకుంది. రీసెంట్ గా ఈ సంస్థ టిల్లు స్క్వేర్ సినిమా నార్త్ అమెరికా హక్కులను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ బిగ్ బడ్జెట్ సినిమాను కూడా సొంతం చేసుకోవడంతో ఆ సంస్థ పేరు హాట్ టాపిక్ గా మారిపోయింది.

నార్త్ అమెరికాలో సినిమాను గ్రాండ్ గా విడుదల చేయాలని ఆ సంస్థ ప్రయత్నాలు చేయనున్నట్లు సమాచారం. ఇక పుష్ప సెకండ్ పార్ట్ కు సంబంధించిన మొదటి సాంగ్ కూడా త్వరలోనే విడుదల కాబోతోంది. రీసెంట్ గా ఒక ప్రోమో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక సినిమాలో రష్మిక మందన్న కథానాయకగా నటిస్తుండగా ఫాహాద్ ఫాసిల్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు.

అలాగే అనసూయ సునీల్ ఇలా ప్రముఖ నటీనటులు అందరూ కూడా సెకండ్ పార్ట్ లో మరింత డిఫరెంట్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. అలాగే బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ తో మెప్పించబొతున్నట్లు టాక్ వినిపించిన విషయం తెలిసిందే. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.