Begin typing your search above and press return to search.

అక్కడ రీ రీలీజ్ లు లేనట్లేనా..?

అయితే, ఇప్పుడు ఈ ట్రెండ్ కి పులిస్టాప్ పడినట్లు తెలుస్తోంది. అయితే, పూర్తిగా కాదు లేదులేండి. కేవలం నంద్యాల పట్టణంలో మాత్రమే.

By:  Tupaki Desk   |   18 Aug 2023 11:41 AM GMT
అక్కడ రీ రీలీజ్ లు లేనట్లేనా..?
X

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల ప్రజెంట్ సినిమాల కంటే, రీ రిలీజ్ సినిమాలు ఎక్కువ సందడి చేస్తున్నాయి. టాలీవుడ్ లోని చిరంజీవి, రామ్ చరణ్, మహేష్, ఎన్టీఆర్ ఇలా అందరి సినిమాలను రి రీలీజ్ చేశారు. వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉంటే, మరి కొన్ని అండర్ రేటెడ్ సినిమాలను రిలీజ్ చేశారు. అప్పుడు పెద్దగా ఆసక్తి చూపించకపోయిన సినిమాలను, ఇప్పుడు సూపర్ గా థియేటర్ కి వెళ్లి మరీ ఎంజాయ్ చేశారు.

ఫ్యాన్స్ ఈ రి రీలీజ్ సినిమాలను చూడటానికి థియేటర్లకు పరుగులు తీశారు. ఆ పాటలకు ఇక్కడ డ్యాన్సులు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి నానా హంగామా చేశారు. ఇప్పటికే చాలా సినిమాలను విడుదల చేయగా, మరికొన్ని విడుదల చేయాలని అనుకున్నారు. అయితే, ఇప్పుడు ఈ ట్రెండ్ కి పులిస్టాప్ పడినట్లు తెలుస్తోంది. అయితే, పూర్తిగా కాదు లేదులేండి. కేవలం నంద్యాల పట్టణంలో మాత్రమే.

అక్కడ, ఈ రీ రీలీజ్ మూవీలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలా నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు. ఈ సినిమాలను చూడటానికి వచ్చిన ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తున్నారు. థియేటర్ లో బాణా సంచా కాల్చడం, సీట్లు చింపడం ఇలా అదీ, ఇదీ అని లేకుండా పిచ్చి పనులు చేసి, థియేటర్ యాజమాన్యానికి నష్టం చేకూరుస్తున్నారు.

రీసెంట్ గా ప్రభాస్ యోగి సినిమాని రీ రిలీజ్ చేశారు. అయితే, నంద్యాలలో ఈ మూవీని చూడటానికి వచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా, ఇంతా కాదు. మూవీ ప్లే అవుతున్న సమయంలో ఏదో అంతరాయం వచ్చి మధ్యలో ఆగిపోయింది. టెక్నికల్ సమస్య వల్ల అలా జరిగింది. అయితే, దానిని వారు అర్థం చేసుకోకుండా, స్క్రీన్ మొత్తం చింపేశారు.

స్క్రీన్ ని రెండు చోట్ల చింపేసి, థియేటర్ లో కుర్చీలను సైతం విరగకొట్టడం లాంటివి చేశారు. వారి అభిమానం శ్రుతి మించి వారు చేసిన పనులకు థియేటర్ యాజమాన్యం ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో వారు అసలు రీ రిలీజ్ సినిమాలు అనేవి విడుదల చేయకూడదంటూ నిర్ణయం తీసుకున్నారు.