Begin typing your search above and press return to search.

చిరు 'చిలకమ్మా' రీమిక్స్ ఉత్తిమాటేనా?

వాటిల్లో రామ్మా చిలకమ్మ పాట రీమిక్స్ లేదు. ఇక మీదట కూడా ఉంటుందనే నమ్మకం లేదు.

By:  Tupaki Desk   |   9 Aug 2023 5:15 AM GMT
చిరు చిలకమ్మా రీమిక్స్ ఉత్తిమాటేనా?
X

మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్‌' సినిమాతో మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మహతి స్వర సాగర్‌ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాని కమర్షియల్‌ ఎలిమెంట్స్ తో నింపేసినట్లుగా ఇప్పటికే విడుదల అయిన ప్రమోషనల్‌ స్టఫ్ తో క్లారిటీ వచ్చింది.

ఆ మధ్య ఈ సినిమాలో చిరంజీవి సూపర్ హిట్‌ సినిమా 'చూడాలని ఉంది' లోని రామ్మా చిలకమ్మ పాటను రీమిక్స్ చేయబోతున్నారు అనే వార్తలు వచ్చాయి. తండ్రి మణిశర్మ ట్యూన్ చేసిన రామ్మా చిలకమ్మ పాటను మహిత స్వర సాగర్‌ రీమిక్స్ చేస్తే బాగుంటుందని చిరంజీవి కూడా భావిస్తున్నారని.. చిరంజీవికి పర్సనల్‌ గా ఆ పాట అంటే ఆసక్తి ఉండటం వల్ల రీమిక్స్ కన్ఫర్మ్ అన్నట్లుగా వార్తలు వచ్చాయి.

మీడియాలో వచ్చిన వార్తలు పుకార్లే అని తేలిపోయింది. ఇప్పటికే భోళా శంకర్‌ నుండి పలు పాటలు వచ్చాయి. వాటిల్లో రామ్మా చిలకమ్మ పాట రీమిక్స్ లేదు. ఇక మీదట కూడా ఉంటుందనే నమ్మకం లేదు. కనుక రీమిక్స్ వార్తలు పుకార్లే అంటూ మెగా ఫ్యాన్స్ కూడా నిట్టూర్చుతున్నారు. కానీ ఆ పాట రీమిక్స్ భోళా శంకర్ లో ఉంటే తప్పకుండా మంచి బజ్ క్రియేట్‌ అయ్యేది అనేది టాక్‌.

భోళా శంకర్ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌ గా నటించగా కీర్తి సురేష్ కీలక పాత్రలో కనిపించింది. ఇంకా ఈ సినిమాలో శ్రీముఖి తో పాటు పలువురు జబర్దస్త్‌ స్టార్స్ కూడా నటించారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక తర్వాత బాగా వార్తల్లో నిలిచింది. అంతే కాకుండా తాజాగా చిరంజీవి వ్యాఖ్యల వల్ల కూడా ఈ సినిమా వార్తల్లో నిలుస్తోంది.

తమిళ సూపర్‌ హిట్ మూవీ వేదాళం కు రీమేక్ గా రూపొందిన ఈ సినిమా లో చిరంజీవి పాత్ర తో పాటు ఆయన డైలాగ్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరిని అలరిస్తాయి. ఏడు ఎనిమిది ఏళ్ల క్రితం వచ్చిన వేదాళం లో అజిత్ కుమార్‌ హీరోగా నటించగా శివ దర్శకత్వం వహించాడు. మొదట నో చెప్పినా ఈ సినిమా కథ విన్న తర్వాత చిరంజీవి నటించేందుకు ఓకే చెప్పాడట.