Begin typing your search above and press return to search.

నోరా స్క్రిప్టు ఇలా ప్రిపేర‌వుతోంది

తాజాగా రిలీజైన ఓ వీడియోలో నోరా ఫ‌తేహి ఆన్ లొకేష‌న్ స్క్రిప్టు చ‌దువుతూ క‌నిపించింది. నోరాతో పాటు ఇత‌ర న‌టీన‌టులు స్క్రిప్టు ప్ర‌తులు ప‌ట్టుకుని శ్ర‌ద్ధగా ప్రిపేర‌వ్వ‌డం ఆసక్తిని క‌లిగిస్తోంది.

By:  Tupaki Desk   |   22 Feb 2024 11:30 AM GMT
నోరా స్క్రిప్టు ఇలా ప్రిపేర‌వుతోంది
X

త‌న‌దైన ఎన‌ర్జీతో లైవ్ వైర్ లా చెల‌రేగిపోయే నోరా ఫ‌తేహి డ్యాన్సులు స్టంట్స్ కి ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్సున్నారు. ఇంత‌కుముందే నోరా త‌న లేటెస్ట్ మూవీ క్రాక్ సెట్స్ లో రిస్కీ స్టంట్ చేస్తూ ప్ర‌మాదానికి గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ అయింది. నోరా ఈసారి భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ తో అభిమానుల ముందుకు వ‌స్తోంది. ఇందులో కండ‌ల హీరో విద్యుత్ జ‌మ్వాల్ స‌ర‌స‌న నోరా ఫ‌తేహి న‌టిస్తోంది.

అత‌డితో ఘాటైన రొమాన్స్ .. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో కనిపించ‌నుంది. ఇంత‌కుముందు విడుద‌లైన ట్రైల‌ర్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించింది. ముఖ్యంగా నోరాకు చాలా వ‌ర‌కూ న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌లో అవ‌కాశం ల‌భించింది. తాజాగా రిలీజైన ఓ వీడియోలో నోరా ఫ‌తేహి ఆన్ లొకేష‌న్ స్క్రిప్టు చ‌దువుతూ క‌నిపించింది. నోరాతో పాటు ఇత‌ర న‌టీన‌టులు స్క్రిప్టు ప్ర‌తులు ప‌ట్టుకుని శ్ర‌ద్ధగా ప్రిపేర‌వ్వ‌డం ఆసక్తిని క‌లిగిస్తోంది.

బాద్షా- నోరా ఫతేహి 'గార్మి క్లబ్'తో ట్రీట్ డైనమిక్ పెయిర్ గా పాపుల‌రైన నోరా ఫతేహి-బాద్షా కొత్త ప్రాజెక్ట్ కోసం మరోసారి క‌లిసి ప‌ని చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇద్దరు స్టార్‌లు తమ హిట్ సాంగ్ 'గార్మి'కి కొన‌సాగింపుగా 'గార్మి క్లబ్'ని లాంచ్ చేయబోతున్నారు. ఈ పాట‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. కానీ ఇంత‌లోనే 'గార్మి క్లబ్'ని ప్రారంభించాలనే ఆలోచన అందరినీ థ్రిల్ కి గురి చేస్తోంది.

ఈ జంట సంగీత ప్రియులు, పార్టీ కోసం క్లబ్ ల‌కు వెళ్లేవారికి తదుపరి హాట్ స్పాట్‌గా మారుతుందనే ఊహాగానాలకు దారితీసింది. కాబట్టి 'గార్మి క్లబ్'ను ఏర్పాటు చేయడానికి, రేసింగ్‌ను కొన‌సాగించ‌డానికి సిద్ధమ‌వుతున్నారు ఫ్యాన్స్. నోరా న‌టించిన క్రాక్ ఫిబ్రవరి 23న విడుదల కానుంది. ఈ చిత్రంలో విద్యుత్ జమ్వాల్, అర్జున్ రాంపాల్, అమీ జాక్సన్ కీలక పాత్రల్లో నటించారు.