Begin typing your search above and press return to search.

నోరా ఫతేహి.. హీటేక్కిస్తున్న గ్లామర్

వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మట్కా సినిమాలో కూడా ఈ అమ్మడు ఐటెం సాంగ్ లో కనిపించబోతోంది.

By:  Tupaki Desk   |   1 Nov 2023 12:22 PM GMT
నోరా ఫతేహి.. హీటేక్కిస్తున్న గ్లామర్
X

ఐటెం గర్ల్ గా అందరికి చేరువ అయిన అందాల భామ నోరా ఫతేహి. ఈ కెనడియన్ భామ ముందుగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. రోర్ అనే మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో టెంపర్ సినిమాలో ఐటెం సాంగ్ లో ఈ అమ్మడు నటించింది. అయితే బాహుబలి సినిమాలో మనోహర సాంగ్ తో భాగా పాపులారిటీ సొంతం చేసుకుంది.


ఊపిరి సినిమాలో ఆమె తెలుగులో చివరిగా నటించింది. వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మట్కా సినిమాలో కూడా ఈ అమ్మడు ఐటెం సాంగ్ లో కనిపించబోతోంది. సినిమాలతో పాటుగా ప్రైవేట్ సాంగ్స్, వెబ్ సిరీస్, టెలివిజన్ షోలలో కూడా నోరా ఫతేహి నటించింది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఈ బ్యూటీ మోడలింగ్ లో కూడా రాణిస్తోంది. రెగ్యులర్ గా ర్యాంప్ వాక్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటోషూట్ లతో కూడా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లాంగ్ ఫ్రాక్ లో ర్యాంప్ పై హొయలు ఒలికిస్తూ అందాలతో ఈ బ్యూటీ కుర్రాళ్ళకి హీట్ పెంచుతుంది.

ఎద అందాలని ఆరబోస్తూ నేత్రానందం అందిస్తోంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. ఈ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ ఉంటే నోరా ఫతేహి గ్లామర్ క్వీన్ గా మరికొంత కాలం తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

అయితే ఈ గ్లామర్ పరంగా నోరాకి మంచి ఇమేజ్ ఉండటంతో ఐటెం క్వీన్ గా రానిస్తోన్న నటిగా మాత్రం తనదైన ముద్ర వేసుకోలేదు. ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ లు డిమాండ్ పెరగడంతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చి అక్కడ నటిగా గుర్తింపు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఒటీటీలో రెండు వెబ్ సిరీస్ లు చేసింది.