Begin typing your search above and press return to search.

వరుణ్‌ కోసం అప్పుడే ల్యాండ్ అయిన బీ టౌన్ బ్యూటీ

ఇంకా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం కాకుండానే బాలీవుడ్‌ ముద్దుగుమ్మ నోరా ఫతేహీ అప్పుడే హైదరాబాద్‌ లో ల్యాండ్‌ అవ్వడం అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.

By:  Tupaki Desk   |   16 Aug 2023 9:14 AM GMT
వరుణ్‌ కోసం అప్పుడే ల్యాండ్ అయిన బీ టౌన్ బ్యూటీ
X

మెగా హీరో వరుణ్‌ తేజ్ తన 14వ సినిమా మట్కా తో పాన్ ఇండియా మార్కెట్‌ లో అడుగు పెట్టబోతున్నాడు. ఈ సినిమా లో మీనాక్షి చౌదరి హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా లో బాలీవుడ్‌ హాట్ బ్యూటీ నోరా ఫతేహీ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.


వైజాగ్‌ నేపథ్యం లో రూపొందబోతున్న మట్కా సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇంకా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం కాకుండానే బాలీవుడ్‌ ముద్దుగుమ్మ నోరా ఫతేహీ అప్పుడే హైదరాబాద్‌ లో ల్యాండ్‌ అవ్వడం అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.

అసలు విషయం ఏంటి అంటే మట్కా సినిమా కోసం దర్శకుడు కరుణ కుమార్‌ ముందస్తుగా వర్క్ షాప్‌ ను నిర్వహిస్తున్నాడు. అందుకోసం చిత్రంలో నటించబోతున్న హీరో మొదలుకుని చాలా మంది నటీ నటులు కూడా వర్క్ షాప్ లో పాల్గొనబోతున్నారు.

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందబోతున్న ఈ సినిమా కథ పీరియాడిక్‌ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. విభిన్నమైన చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న కరణ కుమార్‌ మరో విభిన్నమైన సినిమా తో మట్కా తో రాబోతున్నాడు. ఈ సినిమాను వైరా ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.