Begin typing your search above and press return to search.

నోరా ఫ‌టేహీతో ఆట‌పాటే కాదు..అంత‌కు మించి!

ఓ కీల‌క పాత్ర బాధ్య‌త‌లు ఆమెకి అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది

By:  Tupaki Desk   |   27 July 2023 11:05 AM GMT
నోరా ఫ‌టేహీతో ఆట‌పాటే కాదు..అంత‌కు మించి!
X

బాలీవుడ్ ఐటం బాంబ్ నోరా ఫ‌టేహీ 'టెంప‌ర్' సినిమాతో లాంచ్ అయిన బ్యూటీ అటుపై 'షేర్'.''కిక్'-2.. 'లోఫ‌ర్' లాంటి సినిమాల‌తో ఒకే ఏడాది హంగామా చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ మూడు సినిమాల్లో ఏది ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. అటుపై 'ఊపిరి' సినిమా చేసిన త‌ర్వాత మ‌ళ్లీ టాలీవుడ్ లో క‌నిపించలేదు. బాలీవుడ్ లోనే బిజీ అయింది. తాజాగా ఈ బ్యూటీపై టాలీవుడ్ బాగానే ఫోక‌స్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. అమ్మ‌డి ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు బాగానే అవకావాలు క‌ల్పిస్తున్నారు.

వ‌రుణ్ తేజ్ 14వ సినిమాలో ఎంపికైంది. ఈ ప్రాజెక్ట్ లో నోరా న‌టిస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. మ‌రి సినిమాలో ఐటం పాట‌కే ప‌రిమితం చేస్తారా? కీల‌క పాత్ర ఏదైనా ఆఫ‌ర్ చేసారా? అన్న సందేహం నేప‌థ్యంలో మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం లీకైంది. నోరాని కేవ‌లం పాట‌కే ప‌రిమితం చేయ‌లేదు. ఓ కీల‌క పాత్ర బాధ్య‌త‌లు ఆమెకి అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది. సినిమాలో త‌న పాత్ర సీరియ‌స్ గానే సాగుతుందిట‌.

ఆ క్ర‌మంలో ఓ ఐటం పాట లో క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది. ఒక దెబ్బ‌కి రెండు పిట్ట‌లు అన్న చందంగా నోరాని రెండు ర‌కాలుగా ద‌ర్శ‌కుడు కర‌ణ్ కుమార్ వినియోగించ‌బోతున్నాడు. నోరా ఇప్ప‌టికే ఐటం పాట‌ల్లో ఫేమ‌స్. పాన్ ఇండియా సినిమా 'బాహుబ‌లి'లో సైతం అంద‌చందాల‌తో మెప్పించింది. అంత‌కు ముందు మూడు నాలుగు సినిమాల్లో ఐటం పాట‌ల్లో అల‌రించింది. ఆర‌కంగా నోరా టాలీవుడ్ కి వెల్ నోన్ ఫేస్. కొత్త‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు.

కొన్ని బాలీవుడ్ సినిమాల్లో ఈ త‌ర‌హా అటెంప్ట్ లు ఇప్ప‌టికే చేసే స‌క్సెస్ అయింది. ఐటం పాట‌లో క‌నిపిస్తూ నే గెస్ట్ రోల్ తోనూ మెప్పించింది. క‌ర‌ణ్ కుమార్ ఇప్పుడు అదే స్ట్రాట‌జీతో నోరాని ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న మార్క్ నెక్క‌లీసు గోలుసు లాంటి పాట‌లో నోరా క‌నిపిస్తే థియేట‌ర్లో ర‌చ్చ ర‌చ్చే. నోరా క్రేజ్ కూడా ఇప్పుడు రెట్టింపు అయింది. ఈనేపథ్యంలో టాలీవుడ్ కంబ్యాక్ కొత్త కెరీర్ ని డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది. క్లిక్ అయితే ఈ త‌ర‌హా ఆఫ‌ర్లు మ‌నోళ్లు విరివిగా క‌ల్పిస్తార‌న‌డంలో సందేహం లేదు.