Begin typing your search above and press return to search.

ఆధునిక స్త్రీవాదం సమాజానికి హానికరం: నోరా ఫ‌తేహి

అయితే నోరా ఇదే ఇంట‌ర్వ్యూలో స్త్రీవాదంపైనా త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు చేసింది. దీనిపై ఫ్యాన్స్ లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొంద‌రు అభిమానులను నోరా ఆలోచ‌న నిరాశకు గురి చేసింది.

By:  Tupaki Desk   |   13 April 2024 8:40 AM GMT
ఆధునిక స్త్రీవాదం సమాజానికి హానికరం: నోరా ఫ‌తేహి
X

బాహుబ‌లి మ‌నోహ‌రిగా నోరా ఫ‌తేహి సుప‌రిచితం. త‌న‌దైన అందం డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్ర‌పంచాన్ని ఆక‌ర్షించింది ఈ బ‌యూటీ. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో నోరా ఫ‌తేహి సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. బాలీవుడ్ లో పెళ్లిళ్లు అన్నీ కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ బంధాలు మాత్ర‌మేన‌ని, పేరు గుర్తింపు కోస‌మే ప‌రిశ్ర‌మ‌లో సెల‌బ్రిటీలు పెళ్లి చేసుకుంటార‌ని కామెంట్ చేయ‌డం సంచ‌ల‌న‌మైంది.

ప్ర‌స్తుతం దీనిపై నెటిజ‌నుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. నోరా ఫ‌తేహి ఆడ‌- మ‌గ బంధం బాలీవుడ్ లో చాలా భిన్న‌మైన‌ద‌ని వాదించింది. బాలీవుడ్ లో వివాహాల వెనుక ఉన్న ప్రేరణ ఏమిట‌న్న‌దానిపై నోరా చేసిన కామెంట్లు నిజంగా ఒక ప్ర‌కంప‌నం. దీనిపై బాలీవుడ్ లో ఒక సెక్ష‌న్ గుర్రుగా ఉంద‌ని స‌మాచారం.

అయితే నోరా ఇదే ఇంట‌ర్వ్యూలో స్త్రీవాదంపైనా త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు చేసింది. దీనిపై ఫ్యాన్స్ లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొంద‌రు అభిమానులను నోరా ఆలోచ‌న నిరాశకు గురి చేసింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు సమాన హక్కులు, గౌరవం కోసం పోరాటం ఒక ముఖ్యమైన సమస్య అనేది నోరా అభిప్రాయం. నోరా వ్యాఖ్యలు స్త్రీవాదంపై అపార్థాన్ని క‌లిగించాయ‌ని కొందరు అభిప్రాయపడ్డారు.

ఆధునిక స్త్రీవాదం సమాజానికి హానికరం అని తాను న‌మ్ముతున్న‌ట్టు నోరా పేర్కొంది. స్త్రీవాదం మన సమాజంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని నేను భావిస్తున్నాను అని అన్నారు. కుటుంబం మద్దతు లేకుండా మహిళలు పూర్తి స్వాతంత్య్రం కోసం పోరాడాలనే ఆలోచనకు వ్యతిరేకంగా ఆమె వాదించారు. నిజానికి మహిళలు సహజ సంరక్షకులుగా ఉండాల‌ని విశ్వ‌సించారు. నోరా ఫతేహి మహిళా సాధికారత ప్రాముఖ్యతను గుర్తించినా కానీ, అది కొంత వరకు మాత్రమే కొనసాగాలని విశ్వసించింది. మ‌గ‌వారి వ‌ల్ల‌నే స్త్రీల‌కు అర్థం ఉంటుంద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది.

పరిశ్ర‌మ‌లో లింగ వాదాన్ని కూడా నోరా ఫ‌తేహి త‌న‌దైన శైలిలో ఖండించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. స్త్రీ వాదం పెచ్చుమీరితే ప్ర‌మాదాన్ని కూడా గుర్తించింది నోరా. పురుషులు కుటుంబ‌ సంరక్షకునిగా బాధ్యతలను భుజానకెత్తుకుంటారు. కుటుంబ పోషణలో తమ పాత్రకు ప్రాధాన్యత ఇవ్వడానికి స్త్రీలకు స్వేచ్ఛ ఉంటుంది కానీ... స‌మ‌తుల్య‌త అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయ‌ప‌డింది.

ఆర్థిక మద్దతు కోసం ఆడా మ‌గా విధులునిర్వ‌ర్తిస్తే ఇరువురూ సమానంగా ఉండాల‌నుకుంటే, కుటుంబ‌ అదనపు బాధ్యతలను ఎవరు తీసుకుంటారనే ప్రశ్న తలెత్తుతుందని కూడా నోరా అన్నారు. ఓవ‌రాల్ గా స్త్రీ త‌న కేటాయింపుల‌ను గుర్తించి స‌మ‌తుల్య‌త‌ను పాటించాల‌ని సూచించింది.