నోరాతో పోటీపడలేక చేతులెత్తేసారు
ఇటీవల విడుదలైన నెట్‌ఫ్లిక్స్ `ది రాయల్స్` సిరీస్ లో ఎవరు ముచ్చటించినా నోరా లుక్స్ గురించి , అందం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు.
By: Tupaki Desk | 12 May 2025 3:00 AMబాహుబలి మనోహరిగా నోరా ఫతేహికి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. యూత్ లో నోరాను ఆరాధించి, ప్రేమించే వీరాభిమానులున్నారు. అందుకే బాలీవుడ్ లో ఎంత పోటీ ఉన్నా, కెరీర్ పరంగా క్షణం తీరిక లేకుండా ఏల్తోంది. తనదైన అందం ఆకర్షణ, అద్భుతమైన డ్యాన్సింగ్ నైపుణ్యంతో నోరా ఫతేహి ఈ డికేడ్ లో గుబులు పుట్టిస్తోంది.
ఇటీవల విడుదలైన నెట్‌ఫ్లిక్స్ `ది రాయల్స్` సిరీస్ లో ఎవరు ముచ్చటించినా నోరా లుక్స్ గురించి , అందం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా నోరా బంగారు రంగు బికినీలో గుబులు రేపిన తీరు గురించి చర్చిస్తున్నారు. ఇందులో భూమి పెడ్నేకర్ లాంటి భామ రసవత్తరమైన సన్నివేశాల్లో కనిపించినా కానీ, నోరా షో స్టాపర్ గా నిలిచింది. ఇక ఇందులో ఇషాన్ ఖట్టర్ , భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించగా, నోరా పరిమిత సమయం మాత్రమే కనిపిస్తుంది. జీనత్ అమన్, సాక్షి తన్వర్, విహాన్ సమత్, మిలింద్ సోమన్, చంకీ పాండే వంటి ప్రతిభావంతులైన తారలు ఈ సిరీస్ లో నటించారు. కానీ ఇది చెత్త కథ, కథనాలతో విసిగించిందని రివ్యూవర్లు పేర్కొన్నారు.
ఈ సిరీస్ కి ప్రధాన ఆకర్షణ ఏది? అంటే నోరా ఫతేహి అందచందాలు, బికినీ యాక్ట్ అని చెబుతున్నారు. నోరా ఫోటోలు వీడియోలు కూడా అంతర్జాలంలో వైరల్ అవుతున్నయి. నోరా `ది రాయల్స్`లో ప్రిన్సెస్ ఆయేషా అనే పాత్రలో నటించింది. ఇషాన్ ఖత్తర్ మాజీ ప్రేయసిగా స్టీమీ సన్నివేశాల్లో జీవించింది.