Begin typing your search above and press return to search.

ప్యారిస్‌కి మ‌తి చెడే ట్రీటిచ్చిన నోరా ఫ‌తేహి

నోరా ఇన్ స్టా ఫీడ్ నుంచి కొన్ని ఫోటోలు అంద‌రి క‌ళ్ల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. వీటిలో నోరా ఫ‌తేహి వైట్ అండ్ వైట్ ట్రెంచ్ కోట్ లో హాఫ్ షోల్డ‌ర్ లుక్ తో మ‌తులు చెడ‌గొట్టింది.

By:  Tupaki Desk   |   24 Jun 2025 10:28 PM IST
ప్యారిస్‌కి మ‌తి చెడే ట్రీటిచ్చిన నోరా ఫ‌తేహి
X

`బాహుబ‌లి` మ‌నోహ‌రిగా యువ‌తరం హృద‌యాలపై చెర‌గ‌ని ముద్ర వేసిన నోరా ఫ‌తేహి కెరీర్ ప‌రంగా చాలా దూరం ప్ర‌యాణించిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లో ప‌లు బ్లాక్ బస్ట‌ర్ల‌లో న‌టించిన నోరా, స్పెష‌ల్ నంబ‌ర్ల‌తోను యూత్ ని కిల్ చేసింది. ఇటు సౌత్ లోను నోరా హ‌వా కొన్నేళ్ల పాటు కొన‌సాగింది. ప్ర‌స్తుతం బుల్లితెర డ్యాన్స్ రియాలిటీ షోల జ‌డ్జిగాను నోరా హ‌వా ఎదురే లేకుండా కొన‌సాగుతోంది.

అదే స‌మ‌యంలో నోరా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రెడ్ కార్పెట్ ఈవెంట్ల‌లో త‌న‌ను తాను ఆవిష్క‌రించుకుంటూ దూసుకెళుతోంది. ఈ మొరోకా కెన‌డియ‌న్ బ్యూటీ అంద‌చందాలు, ముగ్ధ మ‌నోహ‌ర రూపానికి మంత్ర‌ముగ్ధులు కాని వాళ్లు లేరు. ఇప్పుడు పారిస్ ఫ్యాషన్ వీక్ కోసం నోరా ఫతేహి ఫ్రాన్స్ లో ఉంది. ఫారెల్ విలియమ్స్ రూపొందించిన లూయిస్ విట్టన్ మెన్స్ స్ప్రింగ్-సమ్మర్ 2026 కలెక్షన్ షోలో పాల్గొంటోంది. ఈ గ్రాండ్ ఫ్యాషన్ ఈవెంట్ జూన్ 24 నుండి జూన్ 29 వరకు జరగనుంది. మంగళవారం నాడు.. ఈ భామ స్ట‌న్నింగ్ ఫోజ్ ల‌తో కెమెరాల ముందు క‌నిపించింది.

నోరా ఇన్ స్టా ఫీడ్ నుంచి కొన్ని ఫోటోలు అంద‌రి క‌ళ్ల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. వీటిలో నోరా ఫ‌తేహి వైట్ అండ్ వైట్ ట్రెంచ్ కోట్ లో హాఫ్ షోల్డ‌ర్ లుక్ తో మ‌తులు చెడ‌గొట్టింది. క‌ళ్ల‌కు బ్లాక్ గాగుల్స్ ధ‌రించి క‌నిపించింది. దీనికి వియ్ ఔట్ సైడ్ అనే సింపుల్ క్యాప్ష‌న్ ని ఇచ్చింది. ఇంత‌కుముందు మెరూన్ లెదర్ ట్రెంచ్ కోట్‌లో వన్ పీస్ డ్రెస్ లోను చాలా అందంగా కనిపించింది. నోరా షేర్ చేసిన ఫోటోగ్రాఫ్స్ లో ఐకానిక్ ఐఫెల్ టవర్ నేపథ్యంలో పోజులిచ్చిన‌వి హైలైట్ గా నిలిచాయి.

నోరాతో పాటు పారిస్ ఫ్యాషన్ వీక్ 2025లో ఇషాన్ ఖట్టర్ , బాద్షా కూడా ఉన్నారు. నోరా కెరీర్ మ్యాట‌ర్ కి వస్తే, ఇటీవల వెబ్ సిరీస్ `ది రాయల్స్‌`లో తన అద్భుత‌ నటనకు ప్రశంసలు అందుకుంది. ప్రియాంక ఘోష్ - నుపుర్ అస్థానా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో ఇషాన్ ఖట్టర్, భూమి పెడ్నేకర్, సాక్షి తన్వర్, జీనత్ అమన్, డినో మోరియా, చుంకీ పాండే త‌దితరులు కూడా ఉన్నారు. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అవుతోంది.