ఫోటో స్టోరి: రంభ ఊర్వశి మేనక చేతులెత్తేస్తారు!
నోరా సోషల్ మీడియాల్లో బోల్డ్ ఫోటోషూట్లతోను పాపులరైంది. ఈ బ్యూటీ తాజా ఫోటోషూట్ నెవ్వర్ బిఫోర్ అంటూ కితాబిచ్చేస్తోంది యూత్.
By: Tupaki Desk | 2 April 2025 8:00 AM ISTస్వర్గంలో `రంభ- ఊర్వశి- మేనక`లను కొట్టే అందగత్తెలున్నారా? ఇంద్రుని కుమార్తెల అందచందాల సమ్మోహనానికి గురి కాని మగాడున్నాడా? .. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం మార్చుకుంటారు. ఇదిగో ఇక్కడ ఆ ముగ్గురిని తలదన్నే అప్సరస ప్రత్యక్షమైంది. ఒకే ఒక్క లుక్కు చాలు.. అల్ట్రా బ్యూటీ ముందు పోటీపడలేక రంభ ఊర్వశి మేనక చేతులెత్తేస్తారు. పోటీ నుంచి నిరభ్యంతరంగా తప్పుకుంటారు.
భారతీయ సినీపరిశ్రమలో దశాబ్ధ కాలంగా హవా సాగిస్తున్న మొరాకో బ్యూటీ నోరా ఫతేహి దేవతా సుందరి రూపంతో కుర్రకారు గుండెల్లో నిదురిస్తోంది. మతి చెడే అందంతో కవ్వించడంలోనే కాదు.. అద్భుతమైన డ్యాన్సింగ్ ప్రతిభతో హృదయాలను గెలుచుకుంది.
నోరా సోషల్ మీడియాల్లో బోల్డ్ ఫోటోషూట్లతోను పాపులరైంది. ఈ బ్యూటీ తాజా ఫోటోషూట్ నెవ్వర్ బిఫోర్ అంటూ కితాబిచ్చేస్తోంది యూత్. ప్రఖ్యాత `బ్రైడ్స్ టుడే` కవర్ పేజీ కోసం నోరా ఫోజులు గుబులు రేకెత్తిస్తున్నాయి. ఈ భామ వైట్ అండ్ బ్లాక్ డిజైనర్ డ్రెస్ లో ఎంతో అందంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ నుదుటిన పాపిడిబొట్టు.. నల్లని కాటుక కళ్లు.. మెడలో వెండి హారం.. చూడగానే భారతీయ ట్రెడిషన్ ని ఎలివేట్ చేస్తుంటే, జడలో పది మూరల మల్ల చెండు సువాసనలు కుర్రకారును మత్తులోకి దించుతోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే...లారెన్స్ మాస్టార్ కాంచన చిత్రంలో నోరా ఫతేహి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా తాజా అప్ డేట్ తెలియాల్సి ఉంది. మరోవైపు రియాలిటీ షోల జడ్జిగాను నోరా పాపులరైంది.
