ప్రియుడితో కెమెరాకు చిక్కిన నోరా ఫతేహి
తాజాగా ఈ భామ పాపులర్ ఇంగ్లీష్ పాప్ స్టార్ బెన్సన్ బూన్‌తో ప్రేమలో పడిందని ప్రచారం సాగుతోంది.
By: Tupaki Desk | 5 Jun 2025 9:14 AM ISTబాహుబలి మనోహరిగా ప్రజల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసిన నోరా ఫతేహి... తెలుగు, హిందీ చిత్రసీమలో ఫేమస్ నటిగా వెలిగిపోతోంది. ముఖ్యంగా ఈ భామ అద్భుత డ్యాన్సింగ్ నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు. నోరా స్ప్రింగ్ లా సాగే దేహశిరులతో మంత్రముగ్ధుల్ని చేస్తుంది. పలు డ్యాన్స్ రియాలిటీ షోల జడ్జిగా ఈ భామ వెలుగుతోంది.
తాజాగా ఈ భామ పాపులర్ ఇంగ్లీష్ పాప్ స్టార్ బెన్సన్ బూన్‌తో ప్రేమలో పడిందని ప్రచారం సాగుతోంది. ఈ సంవత్సరం అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్‌లో నోరా- బెన్సన్ కలిసారు. చిన్న పాటి సంభాషణగా మొదలై, చివరికి ఇద్దరి మధ్యా చూపులు కలిసాయని తెలుస్తోంది. ఈ జంట నడుమ తిరస్కరించలేని కెమిస్ట్రీ ఉంది. ఏదో ఇలా కలిసారు.. అలా చిన్న చర్చ జరిగిందిలే అని సరిపుచ్చలేం. ఇది అంతకంటే ఎక్కువ! అని ఈ కార్యక్రమానికి హాజరైన ఒక ప్రముఖ వ్యక్తి లీకులు అందించారు. అభిమానుల సంఘం ఇన్‌స్టాగ్రామ్‌లో నోరాతో పాప్ స్టార్ బెన్సన్ ఉన్న పలు ఫోటోలను షేర్ చేసింది. అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్‌లో షాబూజీ, నోరా ఫతేహి, జేక్ షేన్‌లతో బెన్సన్ బూన్ అని అభిమాన సంఘం రాసింది.
ఇటీవల నోరా ఓ మీడియాతో మాట్లాడుతూ..''నాకు ఇన్ సైడ్ నుంచి మంచి వ్యక్తి కావాలి. ఇక్కడ నిజంగా చెడ్డ వ్యక్తులు తిరుగుతున్నారు..అవకాశవాదులు ఉపయోగించుకునేవారే అందరూ. అబద్ధాలు చెప్పేవారు కూడా ఉన్నారు. కొంతమంది సంవత్సరాలుగా మీతో ఉంటారు.. మిమ్మల్ని కోరుకోరు.. వారు మీ డబ్బు, మీ సహచరులు లేదా మీ నెట్‌వర్క్‌ను కోరుకుంటారు. చుట్టూ నిజంగా వింతైన వ్యక్తులు ఉన్నారు. మంచి హృదయం ఉన్న వ్యక్తిని కనుగొంటేనే నేను సంతోషంగా ఉంటాను'' అని నోరా చెప్పింది. నోరా చివరిగా 'బి హ్యాపీ విత్ అభిషేక్ బచ్చన్' లో కనిపించింది. రెమో డిసౌ
