Begin typing your search above and press return to search.

ఆ బ్యూటీ సీక్రెట్ అడిగితే ఇంత వెట‌క‌రామా?

ఎవ‌రినైనా మీ బ్యూటీ సీక్రెట్ చెప్పిండి అంటే? ఎంతో సంతోషంగా ఎగిరి గంతేసి మ‌రీ చెబుతారు.

By:  Tupaki Desk   |   25 Dec 2025 10:00 PM IST
ఆ బ్యూటీ సీక్రెట్ అడిగితే ఇంత వెట‌క‌రామా?
X

ఎవ‌రినైనా మీ బ్యూటీ సీక్రెట్ చెప్పిండి అంటే? ఎంతో సంతోషంగా ఎగిరి గంతేసి మ‌రీ చెబుతారు. ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కూ డైట్ ప్లాప్ ఎలా ఉంటుంది? నిద్రకు ఎంత స‌మ‌యం కేటాయిస్తారు? డైటీషియ‌న్లు.. న్యూట్రిష‌న్ల వివ‌రాలు ఇలా ప్ర‌తీది పూస గుచ్చిన‌ట్లు చెబుతారు. నోరా ప‌టేహీ మాత్రం క‌సుబుసునాడిన‌ట్లేమాట్లాడింది. నోరా, మీ స్కిన్ ఇంత గ్లోగా ఉండటానికి ఏం తింటారు? మీ రొటీన్ ఏంటి? అని అడ‌గ‌గా నాకు కారు లేదు...ఆటోరిక్షాలో మాత్ర‌మే తిరుగుతాన‌ని చ‌మ‌త్క‌రించింది. అంత‌కు ముందు కాస్త పాజిటివ్ గానూ మాట్లాడింది.

పాస్తా, అన్నం, ప‌ప్పు, రోటీ, ఉడింకించిన దుంప ప‌దార్దాలు ఎక్కువ‌గా తీసుకుంటాన‌ని చెబుతూనే? కార్లలో మాత్రం తిర‌గ‌న‌న్న‌ట్లు చెప్పుకొ చ్చింది. ఆ స‌మాధానాన్ని కొంద‌రు పాజిటివ్ గా తీసుకున్నా? మ‌రికొంత మంది మాత్రం అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. కార్లు..ఆటోరిక్షాల్లో తిరిగే వారు అందంగా ఉండ‌రా? అన్న‌ది నోరా ఉద్దేశ‌మా? అంటూ మండి ప‌డుతున్నారు. ఖ‌రీదైన కార్లు , ఏసీ గ‌దుల్లో ఉండేవారు మాత్ర‌మే అందంగా ఉంటారు? అన్న‌ది నోరా ఉద్ద‌శేమా? అందుకే అలా మాట్లాడిందా? అంటూ సీరియ‌స్ అవుతున్నారు. మ‌రి ఈ నెగిటివిటీపై నోరా ఎలాంటి బ‌ధులిస్తుందో చూడాలి.

ఈ బ్యూటీ కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్ కు బాగా సుప‌రిచిత‌మే. తెలుగు స్టార్ల చిత్రాల్లో ఐటం పాట‌లతో అల‌రించింది. `టెంపర్`, `బాహుబ‌లి`, `షేర్`, `లోఫర్`, `కేజీఎఫ్‌-2`, `ఊపిరి` లాంటి చిత్రాల‌తో మెప్పిం చింది. అలాగే `మ‌ట్కా`లోనూ న‌టించింది. చివ‌రిగా నోరా `థామా`లో స్పెష‌ల్ సాంగ్ తో అల‌రించింది. మూడేళ్ల త‌ర్వాత చేసిన ఐటం సాంగ్ అది. కానీ థామా అనుకున్నంతగా స‌క్సెస్ అవ్వ‌లేదు. దీంతో నోరా ఎఫెర్ట్ కూడా వృద్ధా ప్ర‌య‌త్న‌మే అయింది. ప్ర‌స్తుతం న‌టిగా రెండు సినిమాలు చేస్తోంది. క‌న్న‌డ‌లో `ది డెవిల్`, త‌మిళ్ లో `కాంచ‌న 4` లో న‌టిస్తోంది.

ఈ రెండు సినిమాల‌పై అమ్మ‌డు చాలా ఆశ‌లు పెట్టుకుంది. అలాగే నోరా ప‌టేహీ వెబ్ సిరీస్ ల‌తో బిజీగానే ఉంది. ది రాయ‌ల్స్ సిరీస్ ఈ ఏడాది ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. కొత్త ఏడాదిలో మ‌రో రెండు సిరీస్ ల‌కు క‌మిట్ కానుంద‌ని తెలుస్తోంది. ఇందులో ఓ ప్ర‌తిష్టాత్మ‌క వెబ్ సిరీస్ కూడా ఉంది. దాన్ని బాలీవుడ్ అగ్ర‌గామి సంస్థ నిర్మిస్తుంది. ఆ వివరాలు త్వ‌ర‌లో అధికారికంగా వెల్ల‌డించ‌నున్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి.