రిలీజ్ కు ఏడాది ముందే టికెట్ సేల్ షురు.. ఏ సినిమానో తెలుసా?
ప్రముఖ థియేటర్ స్క్రీనింగ్ ఐమాక్స్ ఈ మేరకు సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ లో పోస్ట్ షేర్ చేసింది.
By: Tupaki Desk | 17 July 2025 1:11 PM ISTఏదైనా సినిమా విడుదలకు సిద్ధమవుతుందంటే ప్రీ బుకింగ్స్ పైనే అందరి దృష్టి ఉంటుంది. టికెట్ల అమ్మకం ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రేక్షకులు, అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తారు. అయితే సినిమా రిలీజ్ ఇంకో 10 రోజులు లేదా వారం ఉంది అనగా టికెట్ బుకింగ్స్ అందుబాటులోకి తీసుకొస్తారు మేకర్స్. అయితే ఓ సినిమా మేకర్స్ మాత్రం రిలీజ్ కు ఇంకా ఏడాది ఉందనగానే టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అవును మీరు విన్నది కరెక్టే! ఇంతకీ అది ఏ సినిమా అంటే?
హాలీవుడ్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ క్రిస్టోఫర్ నోలన్ ప్రస్తుతం ఒడిస్సీ సినిమా తెరకెక్కిస్తున్నారు. వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమా నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2026 జూలై 17న గ్రాండ్ గా విడుదల కానుంది. అయితే సరిగ్గా ఏడాది ముందు, అంటే ఇవాళ్టి నుంచి ఈ సినిమా టికెట్ సేల్ ప్రారంభం కానుంది.
ప్రముఖ థియేటర్ స్క్రీనింగ్ ఐమాక్స్ ఈ మేరకు సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ లో పోస్ట్ షేర్ చేసింది. నేటి నుంచి ఐమాక్స్ 70mm స్క్రీన్స్ లో ఒడిస్సీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నట్లు ప్రకటన చేసింది. జూలై 17, 2026న ఈ సినిమా విడుదల కావడానికి ఏడాది ముందే బుకింగ్స్ షురూ అవ్వడం ఆశ్చర్యకరమైన విషయమే.
అయితే ఇండియన్ ఐమ్యాక్స్ లో మాత్రం ఇంకా బుకింగ్స్ ప్రారంభం కాలేదు. కానీ, అమెరికా, యూకే, కెనడా దేశాల్లో మాత్రం 70MM ఐమాక్స్ లో సినిమా షో లు షెడ్యూల్ చేసేశారు. ఇప్పటికే అక్కడి ఆడియెన్స్ ఈ సినిమాపై తెగ ఆసక్తి చూసిస్తున్నారు. దీంతో ఓవర్సీల్ లో టికెట్ బుకింగ్ సేల్స్ ఊపందుకోవడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేసేస్తున్నాయి.
గతంలో ది డార్క్ నైట్ రైజెస్ అనే సినిమా రిలీజ్ కు ఆరు నెలల ముందు టికెట్ సేల్ ప్రారంభించారు. తాజాగా ఒడిస్సీ సినిమా ఏకంగా ఏడాది ముందే సేల్ ప్రారంభించడంతో ఇదో రికార్డ్ అయ్యింది. ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే లోపే ఐమాక్స్ 70MM టిక్కెట్లు సోల్డ్ ఔట్ అయ్యే అవకాశం ఉంది.
కాగా, ఈ స్టోరీ పురాతన గ్రీకు కవిత ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో హాలీవుడ్ స్టార్లు టామ్ హోలాండ్, మ్యాట్ డొమన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు 250 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో ఇది రూపొందుతుంది.
