Begin typing your search above and press return to search.

క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో మ‌న సినిమాలేవీ?

కానీ ఈ ఏడాది క్రిటిక్స్ ఛాయిస్ పుర‌స్కారాల పోటీలో తెలుగు సినిమాలు కానీ హిందీ సినిమాలు కానీ లేవు. హాలీవుడ్ క్రిటిక్స్ పుర‌స్కారాలు గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో అంద‌జేసారు.

By:  Tupaki Desk   |   16 Jan 2024 3:48 AM GMT
క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో మ‌న సినిమాలేవీ?
X

2024 క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల విజేత‌ల వివ‌రాలు వెల్ల‌డయ్యాయి. ఈ అవార్డుల్లో క్రిస్టోఫ‌ర్ నోలాన్ 'ఓపెన్‌హైమర్' ఎనిమిది విజయాలతో నంబ‌ర్ వ‌న్ గా నిలిచింది. బార్బీ ఆరు పుర‌స్కారాలు ద‌క్కించుకుంది. ఈ వేడుకలో 'పూర్ థింగ్స్‌'లో నటనకుగాను ఉత్తమ నటి అవార్డు ఎమ్మా స్టోన్‌కు లభించింది. అయితే ది హోల్డోవర్స్‌లో అత్యుత్తమ నటనకు గాను పాల్ గియామట్టి ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు.

క్రిస్టోఫర్ నోలన్ 'ఓపెన్‌హైమర్' 2024 క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్‌లో పెద్ద విజేతగా నిలిచింది. తర్వాత గ్రెటా గార్విగ్ బార్బీ ఆరు పుర‌స్కారాల‌తో రేసులో నిలిచింది. 29వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల కార్య‌క్ర‌మం ఆదివారం జరిగింది. విజేతల జాబితా విడుద‌లైంది. ఒపెన్‌హైమర్ కు ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు , ఉత్తమ సహాయ నటుడు సహా ఎనిమిది ట్రోఫీలను సాధించింది. బార్బీ బెస్ట్ కామెడీ, బెస్ట్ సాంగ్ అవార్డులను గెలుచుకుని ఇత‌ర విభాగాల్లోను పుర‌స్కారాలు గెలుచుకుంది.

టెలివిజన్ రంగంలో ది బేర్, సక్సెషన్, బీఫ్ వంటి షోలు ప‌లు అవార్డులను సాధించాయి. చెల్సియా హ్యాండ్లర్ హోస్ట్ చేసిన స్టార్-స్టడెడ్ వేడుకలో హారిసన్ ఫోర్డ్, అమెరికా ఫెరారా వంటి ఐకాన్ లు కూడా వరుసగా కెరీర్ అచీవ్‌మెంట్ అవార్డు.. సీహెర్ అవార్డును అందుకున్నారు.

ఇంత‌కుముందు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ (హెచ్.సి.ఎ) పుర‌స్కారాల్లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్.ఆర్.ఆర్ కి బెస్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం కేట‌గిరీలో పుర‌స్కారాలు ద‌క్కాయి. కానీ ఈ ఏడాది క్రిటిక్స్ ఛాయిస్ పుర‌స్కారాల పోటీలో తెలుగు సినిమాలు కానీ హిందీ సినిమాలు కానీ లేవు. హాలీవుడ్ క్రిటిక్స్ పుర‌స్కారాలు గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో అంద‌జేసారు. ఇప్పుడు క్రిటిక్స్ ఛాయిస్ పుర‌స్కారాల్ని జ‌న‌వ‌రిలోనే ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. టాలీవుడ్ లేదా బాలీవుడ్ నుంచి ఇటీవ‌ల వ‌చ్చిన సినిమాలేవీ క్రిటిక్స్ ఛాయిస్ పుర‌స్కారాల‌కు అర్హ‌త‌ను సాధించ‌లేక‌పోయాయా? మ‌న మేక‌ర్స్ దానికి ప్ర‌య‌త్నించారా లేదా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఈ ఏడాది ఘ‌న‌విజ‌యం సాధించిన జ‌వాన్- ప‌ఠాన్ లాంటి సినిమాలు క్రిటిక్స్ ఛాయిస్ పుర‌స్కారాల కోసం పోటీప‌డ‌లేద‌ని భావించాల్సి ఉంది.

క్రిటిక్స్ అవార్డుల్లో ప‌లు విభాగాల్లో పోటీ ప‌డిన‌ సినిమాల వివ‌రాలివి:

1) ఉత్త‌మ చిత్రం:

ఓపెన్‌హైమర్

అమెరికన్ ఫిక్షన్

బార్బీ

ది కలర్ పర్పుల్

హోల్డోవర్స్

కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్

మాస్ట్రో

పూర్ థింగ్స్

సాల్ట్బర్న్

2. ఉత్తమ నటి

ఎమ్మా స్టోన్ ఫర్ పూర్ థింగ్స్

కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ కోసం లిల్లీ గ్లాడ్‌స్టోన్

అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ కోసం సాండ్రా హుల్లర్

గత జీవితాల కోసం గ్రేటా లీ

మాస్ట్రో కోసం కారీ ముల్లిగాన్

బార్బీ కోసం మార్గోట్ రాబీ

3. ఉత్తమ నటుడు

ది హోల్డోవర్స్ కోసం పాల్ గియామట్టి

మాస్ట్రో కోసం బ్రాడ్లీ కూపర్

కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ కోసం లియోనార్డో డికాప్రియో

రస్టిన్ కోసం కోల్మన్ డొమింగో

ఓపెన్‌హీమర్ కోసం సిలియన్ మర్ఫీ

అమెరికన్ ఫిక్షన్ కోసం జెఫ్రీ రైట్

4. ఉత్తమ దర్శకుడు

ఓపెన్‌హీమర్ కోసం క్రిస్టోఫర్ నోలన్

మాస్ట్రో కోసం బ్రాడ్లీ కూపర్

బార్బీ కోసం గ్రేటా గెర్విగ్

పేద విషయాల కోసం యోర్గోస్ లాంథిమోస్

హోల్డోవర్స్ కోసం అలెగ్జాండర్ పేన్

కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ కోసం మార్టిన్ స్కోర్సెస్

5. ఉత్తమ సహాయ నటుడు

ఓపెన్‌హైమర్ కోసం రాబర్ట్ డౌనీ జూనియర్

అమెరికన్ ఫిక్షన్ కోసం స్టెర్లింగ్ కె. బ్రౌన్

కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ కోసం రాబర్ట్ డెనిరో

బార్బీ కోసం ర్యాన్ గోస్లింగ్

మే డిసెంబర్ కోసం చార్లెస్ మెల్టన్

పేద విషయాల కోసం మార్క్ రుఫెలో

6. ఉత్తమ సహాయ నటి

హోల్డోవర్స్ కోసం డావిన్ జాయ్ రాండోల్ఫ్

ఓపెన్‌హీమర్ కోసం ఎమిలీ బ్లంట్

ది కలర్ పర్పుల్ కోసం డేనియల్ బ్రూక్స్

బార్బీ కోసం అమెరికా ఫెర్రెరా

న్యాద్ కోసం జోడీ ఫోస్టర్

మే డిసెంబర్ కోసం జూలియన్నే మూర్

7. ఉత్తమ ఒరిజినల్ పాట

నేను బార్బీ కోసం జస్ట్ కెన్

బార్బీ కోసం రాత్రి డాన్స్ చేయండి

సూపర్ మారియో బ్రదర్స్ సినిమా కోసం పీచెస్

రస్టిన్ కోసం స్వేచ్ఛకు మార్గం

ఈ విష్ ఫర్ విష్

బార్బీ కోసం నేను ఏమి తయారు చేసాను

8. ఉత్తమ హాస్యం

బార్బీ

అమెరికన్ ఫిక్షన్

బాటమ్స్

హోల్డోవర్స్

కష్టంగా అనిపించుటలేదు

పూర్ థింగ్స్

9. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్

స్పైడర్ మాన్: స్పైడర్-వెర్స్ అంతటా

ది బాయ్ అండ్ ది హెరాన్

ఎలిమెంటల్

నిమోనా

టీనేజ్ ముటాంట్ నింజా తాబేళ్లు: ముటాంట్ మేహెమ్

విష్

10. ఉత్తమ డ్రామా సిరీస్

వారసత్వం

ది క్రౌన్

దౌత్యవేత్త

మా అందరిలోకి చివర

లోకి

ది మార్నింగ్ షో

స్టార్ ట్రెక్: స్ట్రేంజ్ న్యూ వరల్డ్స్

విన్నింగ్ టైమ్: ది రైజ్ ఆఫ్ ది లేకర్స్ డైనాస్టీ