Begin typing your search above and press return to search.

ఆ సీక్వెల్ లో ముగ్గురు భామ‌ల‌తో మంటలే!

నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ కృతి స‌న‌న్...శ్ర‌ద్దా క‌పూర్- మానుషీ చిల్ల‌ర్ ని హీరోయిన్ల‌గా ఫైన‌ల్ చేసారు. మూడు పాత్ర‌లు ఎంతో రొమాంటిక్ గానూ ఉంటాయ‌ని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   5 April 2024 12:30 PM GMT
ఆ సీక్వెల్ లో ముగ్గురు భామ‌ల‌తో మంటలే!
X

స‌ల్మాన్ ఖాన్ - అనీస్ బ‌జ్మీ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన 'నో ఎంట్రీ' అప్ప‌ట్లో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. 20 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన సినిమా 90 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. అనీల్ క‌పూర్-బోమ‌న్ ఇరానీ-ఇషా డియెల్-లారా ద‌త్-బిపాసా బ‌సు లాంటి తారాగ‌ణం తోడ‌వ్వ‌డంతోనే ఈ స్థాయి స‌క్సెస్ సాధించింది. ఇషా-లారా-బిప్స్..సిలీనా జైట్లీ లాంటి బ్యూటీల అందాలు సినిమాకు అన‌ద‌పు అస్సెట్ గా క‌లిసొచ్చాయి. కామెడీ డ్రామాగా తెర‌కెక్కిన సినిమా ఆద్యంతం న‌వ్వులు పువ్వులు పూయించిన చిత్రంగా నిలిచింది.

తాజాగా రెండు ద‌శాబ్ధాల‌కు చేరువ‌లో ఈ సినిమాకి సీక్వెల్ ప్ర‌క‌టించారు. 'నో ఎంట్రీ -2' తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు నిర్మాత బోనీ క‌పూర్ వెల్ల‌డించారు. మొద‌టి భాగం క‌న్నా రెండ‌వ భాగాన్ని మ‌రింత ఆద్యంతం కామెడీ నేప‌థ్యంతో రూపొందిస్తున్న‌ట్లు తెలిపారు. అయితే ఈసారి తారాగ‌ణం మాత్రం పూర్తిగా మార్చేస్తున్నారు. నేటి జ‌న‌రేష‌న్ హీరోల‌తో ఈ సీక్వెల్ ని రూపొందిస్తున్నారు. వ‌రుణ్ ధావ‌న్-అర్జున్ క‌పూర్ -దిల్జీత్ దోసాంజ్ లు మేల్ లీడ్స్ పోషిస్తున్నారు.

మ‌రి ఫీమేల్ లీడ్స్ ఎవ‌రు? అంటే క‌త్తిలాంటి అందాల్నే రంగంలోకి దించుతున్న‌ట్లు తెలుస్తోంది. నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ కృతి స‌న‌న్...శ్ర‌ద్దా క‌పూర్- మానుషీ చిల్ల‌ర్ ని హీరోయిన్ల‌గా ఫైన‌ల్ చేసారు. మూడు పాత్ర‌లు ఎంతో రొమాంటిక్ గానూ ఉంటాయ‌ని తెలుస్తోంది. హాట్ అప్పిరియ‌న్స్ అందివ్వ‌డంలో ముగ్గురు భామ‌ల్లో ఎవ‌రూ తగ్గేవారు కాదు. ఒక‌రికొక‌రు పోటీ ప‌డి న‌టించేవారే. నేటి జ‌న‌రేష‌న్ యువ‌త‌ని దృష్టి లో పెట్టుకుని కామెడీతో పాటు మ‌రింత రొమాంటిక్ గా చిత్రాన్ని మ‌లిచే అవ‌కాశం ఉంది.

అయితే ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అన్న‌ది ఇంకా ఫైన‌ల్ చేయ‌లేదు. య‌ధావిధిగా అనీస్ బ‌జ్మీని కొన‌సాగిస్తారా? లేక కొత్త ద‌ర్శ‌కుడి పేరును తెర‌పైకి తెస్తారా? అన్న‌ది చూడాలి. షూటింగ్ మాత్రం డిసెంబ‌ర్ నుంచి మొద‌ల‌వుతుంద‌ని బోనీ క‌పూర్ తెలిపారు. ఇటీవ‌ల బోనీ క‌పూర్ నిర్మాణ సంస్థ నుంచి సీక్వెల్స్ జోరు పెరుగుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. కొత్త కంటెంట్ కంటే పాత కంటెంట్ నే మ‌ళ్లీ హైలైట్ చేస్తున్నారు.