Begin typing your search above and press return to search.

టిల్లు గాడి డీజే సౌండ్‌ వినిపించదేం...?

అయినా కూడా టిల్లు స్క్వేర్ సినిమా ప్రమోషన్ విషయంలో అలసత్వం చూపడానికి కారణం ఏంటంటూ కొందరు నెట్టింట ప్రశ్నిస్తున్నారు.

By:  Tupaki Desk   |   15 March 2024 3:47 AM GMT
టిల్లు గాడి డీజే సౌండ్‌ వినిపించదేం...?
X

2022లో వచ్చిన డీజే టిల్లుకు కొనసాగింపుగా, సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్స్ గా మల్లిక్ రామ్‌ దర్శకత్వంలో రూపొందిన 'టిల్లు స్క్వేర్‌' సినిమా కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మార్చి 29న విడుదలకు రెడీ అయ్యింది.

ఇప్పటికే ట్రైలర్‌ కూడా విడుదల చేసిన చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రమోషన్‌ విషయంలో మాత్రం స్పీడ్‌ పెంచడం లేదు. విడుదలకు ఇంకా రెండు వారాల సమయం కూడా లేదు. అయినా కూడా టిల్లు గాడి సౌండ్ వినిపించడం లేదు అంటూ మీడియా సర్కిల్స్ లో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది.

ఈ మధ్య కాలంలో సినిమాల మేకింగ్ కంటే కూడా అధికంగా ప్రమోషన్‌ విషయంలో శ్రద్ద పెడుతున్నారు. సినిమా ప్రమోషన్‌ ని బట్టే ఓపెనింగ్స్ ఉంటాయి. అయినా కూడా టిల్లు స్క్వేర్ సినిమా ప్రమోషన్ విషయంలో అలసత్వం చూపడానికి కారణం ఏంటంటూ కొందరు నెట్టింట ప్రశ్నిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌ లో ఈ సినిమా రూపొందింది. సాధారణంగా సితార నిర్మాత వంశీ తన సినిమాల ప్రమోషన్ విషయంలో చాలా యాక్టివ్‌ గా ఉంటాడు. అలాంటిది ఈ సినిమా ప్రమోషన్ విషయంలో ఎందుకు ఆ జోరు, స్పీడ్‌ కనబర్చడం లేదు అనేది కొందరి ప్రశ్న.

సినిమా కంటెంట్‌ పై నమ్మకంతో ప్రమోషన్స ను చివరి వారంలో చేస్తే సరిపోతుందని భావిస్తున్నారేమో అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. డీజే టిల్లు సూపర్‌ హిట్‌ అయ్యి యూత్ ఆడియన్స్ కి కనెక్ట్‌ అయ్యింది. సీక్వెల్‌ లో కూడా యూత్‌ ఫుల్‌ కంటెంట్‌ ఉంటుందని ట్రైలర్ లో చెప్పారు. కనుక పెద్దగా ప్రమోషన్ అవసరం లేదు అనేది కొందరి అభిప్రాయం.