Begin typing your search above and press return to search.

ఈవారం బాక్సాఫీస్.. లిస్ట్ పెద్దదే కానీ బజ్ లేదు!

ఒక్క సినిమా గురించి కూడా ఎవరూ మాట్లడట్లేదు. గత వారం చిన్నా చితక సినిమాలు అరడజను వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ అందులో ఏ ఒక్కటి కూడా అంతగా ఆడలేదు.

By:  Tupaki Desk   |   13 Oct 2023 12:57 PM IST
ఈవారం బాక్సాఫీస్.. లిస్ట్ పెద్దదే కానీ బజ్ లేదు!
X

ప్రతి వారం ఆడియెన్స్​ను అలరించేందుకు చాలా చిత్రాలే వస్తుంటాయి. అలా వచ్చే వారం టాలీవుడ్ బాక్సాఫీస్​ బాలకృష్ణ భగవంత్‌ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, దళపతి విజయ్​.. వంటి పెద్ద చిత్రాలతో కళకళలాడనుంది. అయితే అంతకన్నా ముందు ఈ వారం పలు చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. కానీ ఈ చిత్రాలు ఏవీ అంతగా బజ్ క్రియేట్ చెయ్యట్లేదని తెలుస్తోంది.

ఒక్క సినిమా గురించి కూడా ఎవరూ మాట్లడట్లేదు. గత వారం చిన్నా చితక సినిమాలు అరడజను వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ అందులో ఏ ఒక్కటి కూడా అంతగా ఆడలేదు. ఇక ఈ వారం డబుల్ అన్నట్లుగా పది, పదకొండు చిత్రాల వరకు వినోదం పంచేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

వీటిలో గుణసుందరికథ, మా ఊరి సినిమా, మధురపుడి గ్రామం అనే నేను, మిస్టరీ, నీతో నేను, పెళ్లెప్పుడు, రాక్షస కావ్యం, సింగిలేటి కథ, తంతిరం, యూనివర్సిటీ చిత్రాలు ఉన్నాయి. అయితే ఈ పది సినిమాల్లో ఏ ఒక్కటి కూడా పెద్దగా బజ్ ను క్రియేట్‌ చేయలేక పోయాయి. జనాలకు ఈ సినిమాల పేర్లు కూడా రిజిస్టర్ అవ్వక థియేటర్స్​కు వెళ్లే సూచనలు కనిపించడం లేదని ట్రేడ్ వర్గాల టాక్.

అసలీ సినిమాలు వస్తున్నాయని జనాలకు కూసింత అవగాహన కూడా లేదనిపిస్తోంది. ప్రేక్షకులు దసరా సినిమాల కోసమే ఎదురుచూస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఇవేకాకుండా తమిళ, హిందీ నుంచి కూడా పలు డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. అవి కూడా తెలిసిన ముఖాలు ఉన్నవి కాదు. అయితే విద్యార్థులకు దసరా సెలవులు నడుస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం బజ్​ లేని ఈ సినిమాలు మౌత్​ టాక్​తో పాజిటివ్ టాక్‌ ఏమైనా దక్కించుకుంటే వసూళ్లు ఏమైనా కొంచెమైనా వస్తాయేమో చూడాలి..

ఏదేమైనప్పటికీ ఫైనల్​గా దసరా పండగకు బిగ్ మూవీస్​తో థియేటర్లు గ్రాండ్​గా కళకళలాడనున్నాయి. ప్రస్తుతానికైనేఈ వారం టాలీవుడ్ గల్లాపెట్టె ఖాళీగా ఉండనుందనే చెప్పాలి!