గుసగుస: సెట్‌లో నటీమణుల కొట్లాట? అసలు నిజం ఇదీ!
వచ్చే వారం విడుదల కానున్న ఓ మల్టీస్టారర్ సినిమా ప్రమోషన్ల సందర్భంగా ఇందులోని నటీమణుల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయంటూ గత కొద్దిరోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి
By: Sivaji Kontham | 10 May 2026 9:40 AM ISTవచ్చే వారం విడుదల కానున్న ఓ మల్టీస్టారర్ సినిమా ప్రమోషన్ల సందర్భంగా ఇందులోని నటీమణుల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయంటూ గత కొద్దిరోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా సెట్‌లో వీరు ఒకరినొకరు కనీసం పలకరించుకోవడం లేదని.. `క్యాట్ ఫైట్స్` జరుగుతున్నాయని సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రంలోని నటీమణులు తాజాగా స్పందించారు. తమ మధ్య ఎటువంటి గొడవలు లేవని.. ఇవన్నీ కేవలం సృష్టించిన పుకార్లని వారు కొట్టిపారేశారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. తాము ముగ్గురం సెట్‌లో ఎంతో సరదాగా గడిపామని సదరు నటీమణులు వివరించారు. కొందరు కావాలనే తాము కలిసి మరో నటిని పక్కన పెడుతున్నట్లు కథనాలు సృష్టిస్తున్నారని..ఇది కేవలం ఒక అపోహ మాత్రమేనని వారు స్పష్టం చేశారు. షూటింగ్ సమయంలో తామంతా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉన్నామని.. నటీనటుల మధ్య ఉండాల్సిన ఆరోగ్యకరమైన అనుబంధం తమ మధ్య ఉందని వారు పుకార్లకు చెక్ పెట్టారు.
ఇదే విషయమై సదరు నటీమణులు మాట్లాడుతూ.. మీడియాలు- సోషల్ మీడియాలో తరచుగా మహిళా నటీమణులను ఒకరిపై ఒకరిని ఉసిగొల్పేలా కథనాలు రాయడం ఒక అలవాటుగా మారిందని మండిపడ్డారు. నటులుగా తమపై తమకు పూర్తి నమ్మకం.. భద్రతా భావం ఉన్నప్పుడు ఇలాంటి అసత్య ప్రచారాలు ఏమాత్రం ప్రభావం చూపవని వారు పేర్కొన్నారు. ఒకరి ప్రతిభను చూసి మరొకరు అసూయ పడాల్సిన అవసరం తమకు లేదని వారు తేల్చి చెప్పారు.
దర్శకుడు రాసిన స్క్రిప్ట్‌లో ప్రతి పాత్రకు దానికంటూ ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉందని.. అందుకే ఒకరి పాత్రతో మరొకరికి పోలికలు లేదా విభేదాలు వచ్చే అవకాశమే లేదని నటీమణులు వెల్లడించారు. సినిమా అనేది అందరం కలిసి చేయాల్సినది.. నాతో పాటు నటించే వారు ఎంత బాగా నటిస్తే సినిమా విజయావకాశాలు అంతగా పెరుగుతాయని.. అది అందరికీ మేలు చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు. వృత్తిపరమైన బాధ్యతతో పని చేస్తున్నప్పుడు గొడవలకు సమయం ఎక్కడుంటుందని వారు ప్రశ్నించారు.
సినిమా రంగంలో మహిళలు కలిసి ఉండలేరనే కల్పిత కథలు చాలా కాలంగా ప్రచారంలో ఉన్నాయని..అయితే వాస్తవం దానికి భిన్నంగా ఉంటుందని ప్రముఖ నటీమణులు స్పష్టం చేశారు. సినిమా అనేది తమ జీవనోపాధి అని, దాని బాగు కోసమే తామంతా శ్రమిస్తామని వారు పేర్కొన్నారు. ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మే 15న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నటీమణుల మధ్య సఖ్యతపై క్లారిటీ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
