డబుల్స్ పై ఫౌజీ టీమ్ కీలక నిర్ణయం? ఏం జరిగింది?
టాలీవుడ్ లో కొన్ని రోజులుగా హీరోల బాడీ డబుల్స్, డూప్స్ యూజ్ చేయడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 8 Feb 2026 1:23 PM ISTటాలీవుడ్ లో కొన్ని రోజులుగా హీరోల బాడీ డబుల్స్, డూప్స్ యూజ్ చేయడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భారీ యాక్షన్ సీన్స్ ఉన్న సినిమాల్లో కొందరు హీరోల స్థానంలో డూప్స్ ఎక్కువగా వాడుతున్నారనే విమర్శలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆ చర్చ మరింత ముదిరింది.
థియేటర్లలో పెద్దగా కనిపించని కొన్ని విషయాలు, ఓటీటీలో క్లియర్ గా కనిపించడంతో ఆ మూవీలో బాడీ డబుల్స్ వినియోగం ఎక్కువగా ఉందంటూ నెట్టింట ట్రోల్స్ చక్కర్లు కొడుతున్నాయి. వీడియో క్లిప్స్ షేర్ చేస్తూ.. సినిమాలో అన్ని ఎక్కువ సీన్స్ లో యూజ్ చేయాలా అంటూ నెటిజన్లు, సినీ ప్రియులు.. చాలా మంది ఫ్యాన్స్ కూడా విమర్శిస్తున్నారు. దీంతో ప్రభాస్ నటిస్తున్న కొత్త మూవీ ఫౌజీ టీమ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఆ సినిమాను హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. హీరోయిన్ గా ఇమాన్వీ నటిస్తోంది. ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న మూవీలో ప్రభాస్ ఓ సైనికుడిగా కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా.. సినిమాను రియాలిస్టిక్ గా చూపించడానికే మేకర్స్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట.
ఈ ఏడాదిలోనే మూవీ రిలీజ్ కానుండగా.. సుమారు 100 నుంచి 120 రోజుల షూటింగ్ ఇంకా మిగిలి ఉందని ఇప్పుడు తెలుస్తోంది. అందులో ఎక్కువ రోజులు యాక్షన్ ఎపిసోడ్స్ కే కేటాయించారని సమాచారం. అయితే ఆ యాక్షన్ సన్నివేశాల్లో పాజిబుల్ అయినంత వరకు ప్రభాస్ స్వయంగా యాక్ట్ చేయాలనే కండీషన్ ను మేకర్స్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప డూప్స్ లేదా బాడీ డబుల్స్ వాడకూడదని డిసైడ్ అయిందట.
అయితే ప్రభాస్ సినిమాలకు వరల్డ్ వైడ్ గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో.. ఆయన స్వయంగా స్టంట్స్ చేస్తేనే అసలైన థ్రిల్ వస్తుందని అభిమానులు, సినీ ప్రియులు ఎప్పుడూ భావిస్తారు. అందుకే రాజా సాబ్ విజయంలో కూడా ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో వాటిని దృష్టిలో పెట్టుకునే ఫౌజీ టీమ్ నిర్ణయం తీసుకుందని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. సినిమాను మరింత రియలిస్టిక్ గా చూపించేందుకు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో ప్రభాస్ నటిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ స్పిరిట్ టీమ్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. యాక్షన్ సన్నివేశాల్లో హీరోకే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. మొత్తానికి డూప్స్ వినియోగంపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ప్రభాస్ అప్ కమింగ్ మూవీ టీమ్స్ డెసిషన్స్ తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది. అయితే ఫౌజీలో యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయో.. ప్రభాస్ ఎంతలా మెప్పిస్తారో వేచి చూడాలి.
