Begin typing your search above and press return to search.

'హరి హర వీరమల్లు' పవన్‌ సినిమానేనా...?

పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నుంచి రాబోతున్న మొదటి సినిమా 'హరి హర వీరమల్లు'.

By:  Tupaki Desk   |   1 Jun 2025 3:25 PM IST
హరి హర వీరమల్లు పవన్‌ సినిమానేనా...?
X

పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నుంచి రాబోతున్న మొదటి సినిమా 'హరి హర వీరమల్లు'. నాలుగు.. ఐదు ఏళ్ల క్రితం ప్రారంభం అయిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. సినిమా చాలా ఆలస్యం కావడంతో దర్శకుడు క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నాడు. దాంతో సినిమా దర్శకత్వ బాధ్యతలను ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ తీసుకున్నాడు. క్రిష్ స్థాయిలో కాకున్నా ఆయన కూడా సినిమాను బాగానే రూపొందించి ఉంటాడు అని పవన్‌ కళ్యాణ్ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. జ్యోతికృష్ణ సినిమా షూటింగ్‌ను కిందా మీదా పడి పూర్తి చేశారు, ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్‌ పనిలో ఉన్నారు.

సినిమా షూటింగ్‌ను ఎంత జాగ్రత్తగా చేస్తారో, అంతకు మించి సినిమాను ప్రమోట్‌ చేసే విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాల యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు ఏ రేంజ్‌లో జరగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంలో ప్రమోషన్‌ కార్యక్రమాలు కీలక పాత్ర పోషించాయి. అందుకే చిరంజీవితో అనిల్‌ రావిపూడి చేస్తున్న సినిమాకు ఇప్పటి నుంచే ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలు పెట్టారు. కానీ మరో పది రోజుల్లో విడుదల కాబోతున్న హరి హర వీరమల్లు సినిమాకు ఇంకా పబ్లిసిటీ కార్యక్రమాలు షురూ కాలేదు.

హరిహర వీరమల్లు సినిమాకి మంచి బజ్ క్రియేట్‌ అయింది. అయితే సినిమాను జనాల్లోకి మరింతగా తీసుకు వెళ్లడం కోసం మేకర్స్ ప్రమోట్‌ చేయాల్సిన అవసరం ఉంది. పవన్‌ కళ్యాణ్‌ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌ మొదలు పెట్టి చాలా కాలం అయింది. కానీ ఆలస్యం కావడంతో సినిమాపై జనాల్లో నమ్మకం తగ్గుతూ వచ్చింది. ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్‌ కళ్యాణ్ సినిమా అంటే విడుదలకు నెల రోజుల నుంచే హడావుడి ఉంటుంది. వీఎఫ్ఎక్స్‌ వర్క్ ముగింపు దశకు చేరుకున్న ఈ సినిమా ట్రైలర్‌ ఇంకా విడుదల చేయలేదు. పెద్ద హీరోల సినిమాల ట్రైలర్‌లను విడుదలకు కనీసం మూడు నాలుగు వారాల ముందే విడుదల చేస్తున్నారు.

ఇప్పటి వరకు వీరమల్లు సినిమా ట్రైలర్‌ను విడుదల చేయలేదు. ట్రైలర్‌ విడుదలకు ఇంకాస్త సమయం పడుతుందని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఓ రేంజ్‌లో ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మేకర్స్ మాత్రం ఇంకా పోస్ట్‌ ప్రొడక్షన్ పనుల్లోనే ఉన్నారు. గత వారం చెన్నైలో పాట విడుదలకు సంబంధించిన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కానీ అది పెద్దగా సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేయలేక పోయింది. సినిమా నుంచి వచ్చిన పాటలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదు. దాంతో సినిమాకు దక్కాల్సిన బజ్‌ దక్కలేదు.

ఈ సినిమా చుట్టూ అలుముకున్న సైలెన్స్‌ను చూస్తూ ఉంటే అసలు ఇది పవన్‌ కళ్యాణ్‌ సినిమానేనా అనే అనుమానం కలుగుతుంది అంటూ స్వయంగా అభిమానులే కామెంట్‌ చేస్తున్నారు. ఇప్పటికి అయినా ప్రమోషన్‌ స్పీడ్‌ పెంచకుంటే కచ్చితంగా పెద్ద దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి. నిర్మాత టికెట్ల రేట్లు పెంపు, భారీ బిజినెస్‌ పై దృష్టి పెట్టకుండా ప్రమోషన్‌ పై కూడా దృష్టి పెడితే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.