Begin typing your search above and press return to search.

2024 రెండు సినిమాలతో నాని..?

ఈ ఇయర్ ఇద్దరు కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి వారి కెరీర్ నే కాదు తన సక్సెస్ ఫాం కూడా కొనసాగించాడు నాని.

By:  Tupaki Desk   |   1 Jan 2024 3:00 AM GMT
2024 రెండు సినిమాలతో నాని..?
X

టైర్ 2 హీరోల్లో వరుస సూపర్ హిట్లతో సూపర్ ఫాం లో ఉన్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఈ ఇయర్ దసరా తో అదరగొట్టి ఎండింగ్ లో హాయ్ నాన్న అంటూ ఒక ఎమోషనల్ సినిమాతో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు నాని. కథల సెలక్షన్స్ లో ప్రతిభ గల దర్శకులను వెతికి పట్టుకోవడంలో తనకు తానే సాటి అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు నాని. ఈ ఇయర్ ఇద్దరు కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి వారి కెరీర్ నే కాదు తన సక్సెస్ ఫాం కూడా కొనసాగించాడు నాని.

ఇక నెక్స్ట్ ఇయర్ కూడా మరో రెండు సినిమాలతో నాని రాబోతున్నాడని తెలుస్తుంది. ఆల్రెడీ వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా చేస్తున్న నాని ఆ సినిమాను వచ్చే సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత హిట్ 3 సినిమాను కూడా 3 నెలల్లో పూర్తి చేసి 2024 సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.

ఏడాదికి రెండు రిలీజ్ లు పక్కా ఉండేలా చూసుకుంటున్న నాని పరిశ్రమకు తన వంతు సహకారాన్ని అందిస్తున్నాడని చెప్పొచ్చు. ఇక సినిమా ఫలితాలు కూడా పాజిటివ్ గా ఉంటున్నాయి కాబట్టి నిర్మాత కూడా సేఫ్ అన్నట్టే. కెరీర్ విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తున్న నాని ఇదే ఫాం కొనసాగించాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు.

వివేక్ ఆత్రేయ తో అంటే సుందరానికీ చేసిన నాని ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకోలేదని మరో ఛాన్స్ ఇచ్చాడు. సరిపోదా శనివారం మరో డిఫరెంట్ కథతో నాని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తో పాటుగా హిట్ 3 ఆ తర్వాత మరో కొత్త దర్శకుడితో నాని సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. మిగతా హీరోలెవ్వరు చేయలేని విధంగా సింపుల్ గా మంచి కథ.. తగిన బడ్జెట్.. తన మార్కెట్ కు తగినట్టుగా సినిమా చేసుకుంటూ సక్సెస్ ఫుల్ జోష్ కొనసాగిస్తున్నాడు నాని. సో 2024 లో కూడా నాని ఇదే హిట్ మేనియాతో దూసుకెళ్లాలని న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు.