Begin typing your search above and press return to search.

కళ్యాణ్ రామ్ మరో క్రేజీ ప్రాజెక్టు షురూ..

ఈ క్రమంలోనే కల్యాణ్​ రీసెంట్​గా మరో కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

By:  Tupaki Desk   |   20 Oct 2023 12:23 PM GMT
కళ్యాణ్ రామ్ మరో క్రేజీ ప్రాజెక్టు షురూ..
X

ప్రతి సినిమాకు వైవిధ్యం చూపుతూ స్టార్‌ హీరోగా ఎదిగారు హీరో నందమూరి కల్యాణ్‌ రామ్. ఈ డైనమిక్ స్టార్​ తన వైవిధ్యమైన నటన, పాత్రలతో ప్రేక్షకుల్లో అభిమానాన్ని సంపాదించుకున్నారు. బింబిసారతో కెరీర్​లో బిగ్గెస్ట్​ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న ఆయన.. ఆ సినిమా సమయంలోనే తాను ఒప్పుకున్న మిగతా సినిమాలను ప్రస్తుతం పూర్తి చేస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే కల్యాణ్​ రీసెంట్​గా మరో కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందులో సయీ మంజ్రేకర్ హీరోయిన్​గా నటిస్తోంది. లేడీ అమితాబ్​ బచ్చన్​గా పేరు పొందిన సీనియర్ నటి విజయ శాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటు ఇతర సినీ ప్రముఖులు కూడా ఈ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు.

మురళి మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. విజయశాంతి ముహూర్తం సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ముప్ప వెంకయ్య చౌదరి స్క్రిప్ట్​ అందించారు. ఈ సినిమాకు ప్రదీప్ చిలకూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే ఈ సినిమాకు పవర్​ఫుల్​ కథను కూడా రాసుకున్నారు. హరి కృష్ణ భండారి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. హై టెక్నికల్ వ్యాల్యూస్​, భారీ బడ్డెజ్​తో సినిమాను నిర్మిస్తున్నారు. అశోకా క్రియేషన్స్​, కల్యాణ్ రామ్ సొంత బ్యానర్​ ఎన్టీఆర్ ఆర్ట్స్​ బ్యానర్​పై సినిమా నిర్మితమవుతోంది.

ముప్ప వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక వర్ధన్​ ముప్పా, సునీ బలుసు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సి రామ్​ ప్రసాద్​ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అజనీశ్ లోక్​నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రొడక్షన్​ డిజైనర్​గా బ్రమ్హ కడాలి వ్యవహరిస్తున్నారు. సినిమాను కల్యాణ్ రామ్​ కెరీర్​లోనే ఓ మైల్​స్టోన్​గా నిలిచిపోయేలా తీర్చిదిద్దుతున్నారట. చిత్రంలో ఆయన పాత్ర ఎంతో పవర్​ఫుల్​గా ఉంటుందని అంటున్నారు.

యాక్షన్ ఎంటర్​టైనర్​గా సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. ఇప్పటికే రిలీజైన అనౌన్స్‌మెంట్‌ పోస్టర్​ కూడా ఎంతో ఆకట్టుకుంది.