Begin typing your search above and press return to search.

నైజాం బిజినెస్.. పుష్ప రాజ్ డబుల్ ట్విస్ట్!

300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న నేపథ్యం కచ్చితంగా టేబుల్ ప్రాఫిట్ వచ్చేలా బిజినెస్ క్లోజ్ చేయాలని అనుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   10 April 2024 4:46 AM GMT
నైజాం బిజినెస్.. పుష్ప రాజ్ డబుల్ ట్విస్ట్!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి నైజాంలో సాలిడ్ మార్కెట్ ఉంటుంది. అతని సినిమాలన్నింటికి నైజాంలో మేగ్జిమమ్ ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. అలాగే బిజినెస్ కూడా ఎక్కువ మొత్తంగా జరిగేది నైజాం ఏరియాలోనే. ఓ విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్ నైజాం కా షేర్ అని అతని సినిమాపై జరిగే బిజినెస్ లెక్కలు చూసి చెప్పొచ్చు. ఈ ఒక్క ఏరియాలోనే ఎన్నో రికార్డులు బన్నీ పేరు మీద ఉన్నాయి.

ఇదిలా ఉంటే పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్స్ లోకి రానుంది. తాజాగా రిలీజ్ అయిన టీజర్ తో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ప్రస్తుతం మూవీకి సంబందించిన బిజినెస్ డీల్స్ డిస్కషన్స్ నడుస్తున్నాయంట. 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న నేపథ్యం కచ్చితంగా టేబుల్ ప్రాఫిట్ వచ్చేలా బిజినెస్ క్లోజ్ చేయాలని అనుకుంటున్నారు.

పుష్ప ది రూల్ సినిమా మీద దేశ వ్యాప్తంగా ఉన్న హైప్ నేపథ్యంలో 400 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమా 90 నుంచి 100 కోట్లకి డీల్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు నడుస్తున్నాయంట.

ఒక వేళ ఈ డీల్ సెట్ అయితే మాత్రం టాలీవుడ్ హిస్టరీలోనే ఆల్ టైం రికార్డ్ పుష్ప ది రూల్ పేరు మీదకి వస్తుంది. ఇప్పటి వరకు రాజమౌళి చేసిన బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాలకి కూడా నైజాంలో ఈ స్థాయిలో బిజినెస్ జరగలేదు. అయితే పుష్ప ది రూల్ మూవీ మీద ఉన్న క్రేజ్ కారణంగా డిస్టిబ్యూటర్స్ పెద్ద మొత్తంలో రైట్స్ కోసం ఇవ్వడానికి ముందుకొస్తున్నారనే మాట వినిపిస్తోంది. డీల్ సెట్టయితే రాజమౌళి రికార్డుతో పాటు ఆల్ టైమ్ బెస్ట్ డీల్ గా ఇది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది.

ఈ డీల్ క్లోజ్ అయితే మరోసారి నైజాం అల్లు అర్జున్ అడ్డా అని ప్రూవ్ అవుతుంది. అలాగే నార్త్ ఇండియాలో కూడా పుష్ప సినిమా రైట్స్ కోసం గట్టి పోటీ ఉందంట. కచ్చితంగా 100 కోట్లకి పైనే హిందీ వెర్షన్ కి సంబందించిన నార్త్ ఇండియా రైట్స్ క్లోజ్ అవ్వొచ్చనే మాట ట్రేడ్ వర్గాలలో వినిపిస్తోంది. అలాగే ఓటీటీ హక్కుల కోసం గట్టి పోటీ నడుస్తోంది.

ఇక పుష్ప 2 కి సంబంధించిన సాంగ్స్ ను కూడా త్వరలోనే ఒక్కొక్కటిగా విడుదల చేయనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ట్యూన్స్ అన్ని కూడా రెడీ అయ్యాయి. మరో స్పెషల్ ఐటెమ్ సాంగ్ కూడా హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మాస్ ఆడియెన్స్ కు కిక్కిచ్చే రెండు పాటలు సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తాయని టాక్ వస్తోంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.