ఆయనతో ఒక్క సినిమా చేసి చనిపోయినా చాలు
టాలీవుడ్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By: Tupaki Desk | 26 July 2025 2:21 PM ISTటాలీవుడ్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తూ ఎంతో బిజీగా ఉంటూనే మరోవైపు హీరోగా తన ఫ్యాన్స్ ను అలరించడానికి సినిమాలు చేస్తున్నారు. పవన్ నటించిన తాజా సినిమా హరి హర వీరమల్లు థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిస్టారికల్ కథతో తెరకెక్కగా వీరమల్లు పాత్రలో పవన్ ఎంతో బాగా ఒదిగిపోయి నటించారు.
జులై 24న రిలీజైన ఈ సినిమాకు డే1 మంచి నెంబర్లే నమోదయ్యాయి. పవన్ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా వీరమల్లు ప్రమోషన్స్ లో కూడా పాల్గొని సినిమాపై హైప్ ను పెంచారు. మీడియాకు ఇంటర్వ్యూలివ్వడంతో పాటూ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు కూడా హాజరై, వీరమల్లును నిత్యం వార్తల్లో నిలిపారు. రీసెంట్ గా ఈ సినిమా సక్సెస్ మీట్ ను చిత్ర యూనిట్ ఏర్పాటు చేయగా ఆ ఈవెంట్ కు కూడా పవన్ హాజరయ్యారు.
వీరమల్లు సక్సెస్ మీట్ లో సినిమాలో నటించిన ఓ నటి ఆయనతో ఫోటో దిగడానికి వచ్చారు. ఫోటోతో ఆగకుండా స్టైజ్ పైనే పవన్ ను హగ్ చేసుకున్నారు. మామూలుగానే చాలా మొహమాటస్తుడైన పవన్ కళ్యాణ్ ఆమె ప్రవర్తనకు సిగ్గు పడ్డారు. కానీ నివిత మాత్రం ఫోటో దిగగానే వెంటనే స్టేజ్ పై గంతులేయగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈవెంట్ అనంతరం ఆమె మాట్లాడుతూ, తను పవన్ కు చాలా పెద్ద అభిమానినని చెప్పారు. అంతేకాదు, గతంలో పవన్ తాగిన వాటర్ బాటిల్ ను కూడా తాను చాలా భద్రంగా దాచుకున్నానని చెప్తూ, హ్యాండ్ బ్యాగ్ లోపలి నుంచి ఆ వాటర్ బాటిల్ ను తీసి చూపించడంతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. కళ్యాణ్ తనను గుర్తించడం చాలా గర్వంగా ఉందని చెప్పిన నివిత, ఆయనతో ఒక్క సినిమా చేసి చనిపోయినా చాలంటూ ఎమోషనల్ అయ్యారు. దీంతో అభిమానం ఉండొచ్చు కానీ మరీ ఈ రేంజ్ లోనా అంటూ ఆ వీడియోకు కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం పవన్ ఫ్యాన్స్ అంటే ఇలానే ఉంటారంటూ కామెంట్స్ చేస్తూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.
