లోకేష్ నిర్మాతగా 'బెంజ్'.. LCUపై ఎఫెక్ట్ పడుతుందా?
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. ఇప్పుడు కూలీ మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 4 Jun 2025 6:48 PM ISTయంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. ఇప్పుడు కూలీ మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. ఆగస్టు 14వ తేదీన మూవీ విడుదల కానుంది. అదే సమయంలో ఆయన బెంజ్ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అంతేకాదు స్టోరీ కూడా అందించారు. రోమియో అండ్ సుల్తాన్ ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొన్ని నెలల క్రితం అనౌన్స్మెంట్ రాగా.. ఇప్పుడు స్పీడ్ గా చిత్రీకరణను నిర్వహిస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా చెన్నైలో షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అయిందని సమాచారం.
బెంజ్ లో ప్రముఖ నటుడు, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. సీనియర్ హీరో మాధవన్, మాలీవుడ్ స్టార్ హీరో నివిన్ పౌలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అందాల భామ ప్రియా మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కోలీవుడ్ నయా మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ బాణీలు సమకూరుస్తున్నారు.
అయితే లోకేష్.. ఇప్పటికే తన యూనివర్స్ (LCU)ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అందులో ఇప్పటికే ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు తీశారు. త్వరలో ఖైదీ సీక్వెల్ ను స్టార్ట్ చేయనున్నారు. అదే సమయంలో ఇప్పుడు బెంజ్ స్టోరీని తన సినిమాటిక్ యూనివర్స్ కు లోకేష్ లింక్ చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మలయాళ నటుడు నివిన్ పౌలీ బెంజ్ లో విలన్ పాత్ర పోషించబోతున్నారని, ఆ సినిమాతో ఆయన లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లోకి ఎంట్రీ ఇస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. లోకేష్ రిస్క్ తీసుకుంటున్నట్లు అనిపిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను ఏర్పరచుకున్న LCU హైప్ పై ప్రభావం చూపవచ్చని అంటున్నారు. అందుకు కారణాలు కూడా చెబుతున్నారు. LCUలో ఉన్న వారంతా స్టార్ నటులని చెబుతున్నారు. కానీ నివిన్ పౌలీ అలా కాదని చెబుతున్నారు. ఇప్పుడు బెంజ్ రిజల్ట్ తేడా కొట్టినా.. ఇబ్బందని అంటున్నారు. మరి అసలు నివిన్ పౌలీ నిజంగా LCUలోకి ఎంట్రీ ఇస్తారో లేదో చూడాలి.
