Begin typing your search above and press return to search.

ఛాంపియన్ గా నిలిచిన 'పాగల్‌' బ్యూటీ

మెంటల్ మదిలో సినిమా తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్‌

By:  Tupaki Desk   |   23 Jan 2024 11:04 AM GMT
ఛాంపియన్ గా నిలిచిన పాగల్‌ బ్యూటీ
X

మెంటల్ మదిలో సినిమా తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్‌. ఈ అమ్మడు తెలుగు లో పలు సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు దక్కించుకున్న ఈ అమ్మడు తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా నటించి మెప్పించింది.


ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు బ్యాడ్మింటన్ లో సత్తా చాటింది. తాజాగా జరిగిన మిక్స్డ్‌ డబుల్స్ లో నివేదా పేతురాజ్ ఛాంపియన్ గా నిలిచింది. తన ఆటతో ఆకట్టుకోవడంతో పాటు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నివేదా గురించి చర్చ జరుగుతోంది.


సాధారణంగా హీరోయిన్స్ ఇలాంటి ఛాంపియన్‌షిప్స్ లో పాల్గొనడం అరుదుగా చూస్తూ ఉంటాం. వారికి అలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా సినిమాల్లోకి వచ్చిన తర్వాత వాటిని పక్కకు పెట్టి కెరీర్ పై దృష్టి పెడతారు. కానీ పాగల్‌ హీరోయిన్ నివేదా మాత్రం బ్యాడ్మింటన్ ను కొనసాగించింది.

హీరోయిన్ గా ఈమెకు దక్కిన ఛాన్స్ లు ఎక్కువే. అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. ముందు ముందు అయినా ఈమె హీరోయిన్ గా కమర్షియల్‌ సక్సెస్ లను సొంతం చేసుకుంటుందేమో చూడాలి. సోషల్‌ మీడియాలో ఈమె అందాల ఫోటోలు రెగ్యులర్ గా వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం.