పిక్ ఆఫ్ ది డే: అందరి కళ్ళు ఆమెపైనే!
హీరోల సంగతి కాస్త పక్కన పెడితే.. హీరోయిన్లు ఉన్నట్టుండి బరువు పెరుగుతారు.
By: Tupaki Desk | 25 Dec 2025 3:13 PM ISTహీరోల సంగతి కాస్త పక్కన పెడితే.. హీరోయిన్లు ఉన్నట్టుండి బరువు పెరుగుతారు. మరొకసారి బక్క చిక్కిపోయి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అయితే హీరోయిన్లు అందరూ ఇలాగే ఉంటారా అంటే కాదనే చెప్పాలి. కొంతమంది హీరోయిన్స్ మాత్రం తమ శరీరంలో జరిగే అనూహ్య మార్పుల కారణంగా ఉన్నట్టుండి బరువు పెరిగిపోయి అందరిని ఆశ్చర్య పరుస్తారు. ఆ తర్వాత సన్నబడి ఆ కొత్త లుక్కుతో మరోసారి ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి వారి జాబితాలోకి ప్రముఖ హీరోయిన్ నివేదా థామస్ కూడా వచ్చి చేరింది.
ఒకప్పుడు తన అందంతో నటనతో అందరినీ ఆశ్చర్యపరిచిన ఈమె సడన్ గా 35 చిన్నకథ కాదు అనే సినిమాలో గుర్తుపట్టలేనంతగా.. తల్లి పాత్రలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. బరువు పెరిగిపోయి విమర్శలు కూడా ఎదుర్కొంది ఈ ముద్దుగుమ్మ. అలాంటి ఈమె ఇప్పుడు మళ్లీ తన గ్లామర్ టచ్ తో అభిమానులను సైతం మెస్మరైజ్ చేసింది. స్లీవ్ లెస్ చుడీదార్ ధరించిన ఈమె తన అందంతో కాస్త బరువు తగ్గి స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిస్తూ అభిమానులను ఆకట్టుకుంది. ఒక తాజాగా నివేదా థామస్ షేర్ చేసిన ఆ ఫోటోలు అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా పిక్ అప్ ది డే అని అవమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. అలా తన అందంతో మరోసారి వార్తల్లో నిలిచింది నివేదా థామస్.
నివేదా థామస్ సినిమాల విషయానికొస్తే.. చివరిగా 35 చిన్న కథ కాదు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు ప్రకటించకపోయినా ఇలా తన లుక్కుతో హాట్ టాపిక్ గా మారింది. 1994 నవంబర్ 2న మద్రాసులో జన్మించిన ఈమె ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పూర్తి చేసింది. పేరుకే తమిళ నటి అయినప్పటికీ ఏకంగా ఆరు భాషలను అనర్గళంగా మాట్లాడగలదు. అలా మలయాళం, తమిళ్ ఫ్రెంచ్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ భాషలలో పట్టు సాధించింది.
సన్ టీవీలో ప్రసారమైన ప్రముఖ తమిళ సీరియల్ మై డియర్ భూతం లో నటించి బాలనటిగా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత నటిగా తన కెరియర్ ను ఆరంభించింది. అలా 2008లో మొదలైన ఈమె నటన ప్రస్థానం 2016 వరకు తమిళ్, మలయాళం చిత్రాలలో నటించింది. ఇక 2017లో తొలిసారి నిన్ను కోరి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన నివేదా థామస్.. ఆ తర్వాత జై లవకుశ సినిమాలో కూడా నటించింది. ఇక 118, బ్రోచేవారెవరురా, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ , వకీల్ సాబ్ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు చూసి అభిమానులు.. అందరి కళ్ళు ఈమె పైనే అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
