నివేదా థామస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై నెట్టింట చర్చ!
చైల్డ్ ఆర్టిస్ట్‌గా మలయాళ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన నివేదా థామస్ ఆ తరువాత దళపతి విజయ్ నటించిన `కురివి`లో తనకు సిస్టర్‌గా నటించి ఆకట్టుకుంది.
By: Tupaki Desk | 16 Jun 2025 10:00 PM ISTచైల్డ్ ఆర్టిస్ట్‌గా మలయాళ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన నివేదా థామస్ ఆ తరువాత దళపతి విజయ్ నటించిన `కురివి`లో తనకు సిస్టర్‌గా నటించి ఆకట్టుకుంది. తమళ మూవీ `పోరాలి`తో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది. నాని `జెంటిల్‌మెన్` మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన నివేదా థామస్ తనదైన మార్కు నటనతో మలయాళ, తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ మధ్య హీరోయిన్ క్యారెక్టర్లకు బ్రేక్ ఇచ్చిన నివేదా రజనీ దర్బార్, పవన్ వకీల్ సాబ్ వంటి సినిమాల్లోని కీలక పాత్రల్లో కనిపించింది.
అప్పటి నుంచి సెలెక్టీవ్‌గా సినిమాలు చేయడం మొదలు పెట్టిన నివేదా థామస్ గత ఏడాది చేసిన మూవీ `35 చిన్న కథకాదు`. కొత్త దర్శకుడు నంద కిషోర్ ఈమని రూపొందించిన ఈ మూవీలో నివేదా లావుగా మారి కనిపించడం పలువురిని షాక్‌కు గురి చేసింది. ఇద్దరు పిల్లల తల్లిగా నివేదా పాత్రకు తగ్గట్టుగా కనిపించడంతో అంతా అవాక్కయ్యారు. ఇప్పుడు నివేద నటించిన ఈ మూవీ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన `గద్దర్` పురస్కారాల్లో అవార్డుని దక్కించుకుని చర్చనీయాంశంగా మారింది.
నివేదా థామస్ అప్పియరెన్స్స్, ఆమె ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి, తను ఉన్న పలంగా బరువు పెరగడంపై కామెంట్‌లు చేస్తుంటే మరి కొంత మంది మాత్రం ఆమె అప్పియరెన్స్‌పై విమర్శలు చేసే వారు ఆమె నటనకు అభినందలు కురిపించాలని, తను `35 చిన్న కథ కాదు` చిత్రానికి గానూ ఉత్తమ నటిగా అవార్డుని సొంతం చేసుకుందని నివేదపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో నివేదా థామస్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే నివేదా థామస్ త్వరలో మరో క్రేజీ మూవీలో నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో టాబు ఓ కీలక పాత్రలో నటిస్తుండగా మరో కీలక క్యారెక్టర్ కోసం నివేదా థామస్‌ని పూరి ఫైనల్ చేశాడని తెలుస్తోంది. ఇది ఎంత వరకు నిజం అన్నది తెలియాలంటే పూరి టీమ్ స్పందించాల్సిందే.
