త్రివిక్రమ్ పిలిస్తే స్క్రిప్టు వినకుండానే.. నివేదకు ఎందుకంత గుడ్డి నమ్మకం?
ఈ చిత్రంలో ప్రత్యేక గీతంలో అలరించిన డింపుల్ హయాతి మాట్లాడుతూ.. చాలా కాలం తర్వాత తాను ఈ సాంగ్ చేశానని తెలిపారు.
By: Tupaki Desk | 28 Sept 2026 9:36 AM ISTఅందరి ఆసక్తి `ఆదర్శకుటుంబం`పైనే. వెంకీ మామ- త్రివిక్రమ్ కాంబినేషన్ మరోసారి తెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తోందో చూడాలనే ఉత్సాహం అందరిలో ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలయ్యాయి. `ఆదర్శ కుటుంబం` సినిమా నుంచి నారాయణమ్మ.. పాటను లాంచ్ చేసారు. ఈ వేడుకలో హీరోయిన్లు నివేదా పేతురాజ్, శ్రీనిధి శెట్టి , డింపుల్ హయాతి తమ అందచందాలు, అద్భుతమైన ఫన్నీ స్పీచ్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. వారు అందించిన కొత్త విషయాలు సినిమాపై మరింతగా అంచనాలను పెంచాయి.
అల వైకుంఠపురములో చిత్రం తనకు మంచి బ్రేక్ ఇచ్చిందని.. త్రివిక్రమ్ గారు పిలిస్తే స్క్రిప్ట్ కూడా వినకుండా సినిమా ఒప్పుకునే దర్శకులలో ఆయన మొదటివారని నివేదా పేతురాజ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో వెంకటేష్ గారితో పనిచేయాలనే తన చిరకాల కోరిక నెరవేరిందని..ఆయన మానిటర్ ముందు చేసే మ్యాజిక్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని తెలిపారు. వెంకటేష్ గారు, శ్రీనిధి, డింపుల్ అందరూ మంచి పాజిటివ్ వైబ్స్ ఇచ్చారని., ఈ ఎంటైర్ టీమ్‌తో పనిచేయడం చాలా సరదాగా గడిచిందని అన్నారు. సంగీత దర్శకుడు తమన్ డే అండ్ నైట్ కష్టపడి అద్భుతమైన పాట ఇచ్చారని కొనియాడారు. అలాగే భాను మాస్టర్.. ఆయన టీమ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ.. తాను డ్యాన్సుల పరంగా డెవలప్ చేసుకోవడానికి ఎంతో స్పేస్ ఇచ్చారని ప్రశంసించారు.
ఇక ఈ సినిమా షూటింగ్ అనుభవాల గురించి శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. త్రివిక్రమ్ సినిమాల షూటింగ్ పిక్నిక్ లా ఉంటుందని అందరూ చెప్పేవారని.. తాను ప్రత్యక్షంగా అనుభవించిన తర్వాతే ఆయనను అందరూ `గురూజీ` అని ఎందుకు అంటారో అర్థమైందని అన్నారు. సీనియర్ నటులతో పనిచేసేటప్పుడు ఉండే ఒత్తిడి లేకుండా..వెంకటేష్ గారు అత్యంత ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించారని కొనియాడారు. త్రివిక్రమ్ - వెంకటేష్‌ల ఈ గోల్డెన్ కాంబినేషన్‌లో భాగం కావడం ఎంతో గౌరవంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో ప్రత్యేక గీతంలో అలరించిన డింపుల్ హయాతి మాట్లాడుతూ.. చాలా కాలం తర్వాత తాను ఈ సాంగ్ చేశానని తెలిపారు. తన మొదటి పాటకు వెంకటేష్ గారు అతిథిగా రాగా.. ఇప్పుడు ఆయనతో కలిసి డ్యాన్స్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తనకు త్రివిక్రమ్ గారితో ముందుగా పరిచయం లేకపోయినా.. ఈ షూటింగ్ సమయంలో పనితీరు చూసి ఆయనకు ఉన్న ప్రత్యేకత ఏమిటో తనకు తెలిసివచ్చిందని డింపుల్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ఇతర ప్రముఖుల పనితీరును నివేదా పేతురాజ్ తనదైన శైలిలో సరదాగా విశ్లేషించారు. సంగీత దర్శకుడు తమన్ డే అండ్ నైట్ శ్రమించి ఒక హరికేన్ లాంటి అద్భుతమైన ట్యూన్ ఇచ్చారని.. నిర్మాత చినబాబు గారు ఎంతో ప్రశాంతంగా బుద్ధుడిలా పాజిటివ్ ఎనర్జీని పంచుతారని తెలిపారు. అలాగే శ్రీనిధి శెట్టిలో ఉండే ప్రశాంతతను తాను ఎంతగానో అడ్మైర్ చేస్తానని... డింపుల్ హయాతి మాత్రం ఒక క్రేజీ అండ్ బ్లాస్ట్ ఆఫ్ ఎనర్జీ ఉన్న డ్యాన్సర్ అని ప్రశంసించారు.
అన్ని హంగులను సంతరించుకున్న ఈ `ఆదర్శ కుటుంబం` చిత్ర ప్రయాణంలో చేరడం ఎంతో సంతృప్తినిచ్చిందని నటీమణులందరూ పేర్కొన్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా.. అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ చూసి పెద్దఎత్తున విజయవంతం చేయాలని వారు కోరారు.
