Begin typing your search above and press return to search.

త‌ల్లి-కొడుకు మ‌ధ్య న‌లిగిపోయిన కోడ‌లు!

బాలీవుడ్ ఎవ్వ‌ర్ గ్రీన్ జోడీ రిషీ క‌పూర్-నితూక‌పూర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అత్యంత ప్ర‌జాదార‌ణ పొందిన జంట‌ల్లో ఆ జోడీ ఒక‌రు.

By:  Tupaki Desk   |   11 Jan 2024 11:30 AM GMT
త‌ల్లి-కొడుకు మ‌ధ్య న‌లిగిపోయిన కోడ‌లు!
X

బాలీవుడ్ ఎవ్వ‌ర్ గ్రీన్ జోడీ రిషీ క‌పూర్-నితూక‌పూర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అత్యంత ప్ర‌జాదార‌ణ పొందిన జంట‌ల్లో ఆ జోడీ ఒక‌రు. ప్రేమ వివాహం చేసుకుని ఆద‌ర్శ దంప‌తులుగా బాలీవుడ్ ని ఏలిన జోడీ అది. రిషీ క‌పూర్ ఇప్పుడు ప్రేక్ష‌కాభిమానుల మ‌ధ్య లేక‌పోయినా ఆయ‌న జ్ఞాప‌కాలెన్నో ఉన్నాయి. అవెప్ప టికీ అభిమానుల గుండెల్లో ప‌దిల‌మే. తాజాగా నీతూక‌పూర్ క‌ర‌ణ్ జోహార్ టాక్ షో కాపీ విత్ క‌ర‌ణ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు.

జీనత్ అమన్‌తో కలిసి నీతూ ఈ షోలో పాల్గొన‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా రిషీతో నీతూక‌పూర్ బాండింగ్ ఎలా ఉండేది? అప్ప‌ట్లో రిషీ క‌పూర్ ఎలా ఉండేవారు? వంటి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. `మేము ఇద్ద‌రం ప్ర‌త్యేకించి య‌శ్ చోప్రాతో ఎంతో అద్భుత‌మైన స‌మ‌యాన్ని గ‌డిపాం. మేము రాత్రిపూట పార్టీ చేసుకుంటాము. మా పార్టీ అంటే అప్పుడు చాలా డిఫ‌రెంట్ గా ఉండేది. అంతా ఓ చోట చేరి అంతాక్షరి ఆడుకునేవాళ్లం. ఇంకా ఇలాంటి లెక్క‌లేన‌న్ని ఆట‌లు ఎన్నో ఉన్నాయి.

అవే మాపార్టీలు.. అది మాకెంతో స‌ర‌దాగా ఉండేది. అది నిజంగా సరదాగా ఉండేది. రిషి కపూర్ 'స్ట్రిక్ట్' బాయ్‌ఫ్రెండ్. ఆయ‌న‌కు పార్టీల‌వీ న‌చ్చ‌వు. పార్టీల‌వీ ఇష్టం ఉండ‌ద‌ని చెప్పేవారు. అలాగ‌ని స్వేచ్ఛ‌ని హ‌రించేవారు కాదు. కావాల్సినంత ప్రీడ‌మ్ ఉండేది. `యే నహీ కర్ణా.. వో నహీ కర్ణా, ఘర్ ఆజావో (ఇలా చేయవద్దు, అలా చేయవద్దు, ఇంటికి రండి ) ఇలా ఏం ఉండేది కాదు. కానీ ఆ రోజుల్లో పార్టీల‌కు నేను వెళ్లేదాన్ని కాదు. అలాగే మా అత్త‌గారు కూడా చాల క‌ఠినంగా ఉండేవారు.

ఆ కుటుంబానికి అన్ని ర‌కాలుగా క‌ట్టుబ‌డి ఉన్నాను. త‌ల్లి-కొడుకు మధ్య అప్పుడ‌ప్పుడు నేను న‌లిగిపో యేదాన్ని. నాకు విచారకరమైన విష‌యాలు గుర్తు పెట్టుకోవ‌డం ఇష్టం ఉండ‌దు. కానీ రిషీతో మా సంబం ధం యొక్క మంచి భాగాన్ని మరియు న్యూయార్క్‌లో మా సమయాన్ని గుర్తుంచుకోవడానికి నేను ఇష్టప డతాను` అని అన్నారు. రిషీ క‌పూర్ న్యూయార్క్ లో కేన్స‌ర్ చికిత్స తీసుకున్న సంగ‌తి తెలిసిందే.