Begin typing your search above and press return to search.

రాజ‌మౌళి- శంక‌ర్‌లా క‌ఠినాత్ముడు కాడు

నితేష్ తివారీ 'రామాయణం' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇంత‌లోనే అనధికారికంగా కొన్ని ఫోటోలు లీకైపోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

By:  Tupaki Desk   |   5 April 2024 6:31 AM GMT
రాజ‌మౌళి- శంక‌ర్‌లా క‌ఠినాత్ముడు కాడు
X

త‌న సినిమాల సెట్స్ నుంచి ఏదైనా ఫోటో లేదా వీడియో లీక్ అయ్యేందుకు స‌సేమిరా అంటాడు శంక‌ర్. ఆ త‌ర్వాత అదే ఫార్ములాను అనుస‌రించారు ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి. ఇత‌ర ద‌ర్శ‌కుల‌కు భిన్నంగా ఈ ఇద్దరు స్టార్ డైరెక్ట‌ర్లు సెట్లో ప‌రిస్థితుల్ని పూర్తిగా త‌మ అదుపులో ఉండాల‌ని కోరుకుంటారు. లీకేజీల‌కు ఆస్కారం ఇవ్వ‌ని గండ‌ర‌గండ‌ళ్లు అన్న టాక్ ఉంది. క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో చాలా క‌ఠినాత్ములు.

అయితే అంద‌రికీ ఇది సాధ్యం కాదు. మ‌ణిర‌త్నం అంత‌టి వాడే ఆన్ లొకేష‌న్ నుంచి లీకులు ఆప‌లేని ప‌రిస్థితి. ఇప్పుడు నితీష్ తివారీ కూడా రామాయ‌ణం లాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క సినిమాని తెర‌కెక్కిస్తూ అడ్డంగా దొరికిపోతున్నాడు. ఈ సినిమా ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైంది. కానీ అప్పుడే లీకుల‌తో ఇంట‌ర్నెట్ హోరెత్తిపోతోంది.

నితేష్ తివారీ 'రామాయణం' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇంత‌లోనే అనధికారికంగా కొన్ని ఫోటోలు లీకైపోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఈ ఫోటోల్లో పాత్ర‌లేమిటో చూడ‌గానే క్యాచ్ చేసేయ‌గ‌లం. దశరధునిగా అరుణ్ గోవిల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా షీబా చద్దా న‌టిస్తున్నారని అర్థ‌మ‌వుతంది. యువ‌కుడైన రాముడు ల‌క్ష్మ‌ణుడు భ‌రతునితో సంభాషిస్తున్న ద‌శ‌ర‌థుని ఫోటోతో పాటు కైకేయి లుక్ కి సంబంధించిన ఫోటోలు లీక‌వ్వ‌డం విశేషం. నితీష్ ద‌ర్శ‌కుడిగా త‌న ప‌నిలో తాను ఉన్నారు. ఇంత‌లోనే కొంద‌రు వాటిని సెల్ ఫోన్ లో చిత్రీక‌రించి ఇలా లీక్ చేసార‌ని భావించాల్సి ఉంటుంది.

'రామాయణం'లో శ్రీ‌రామునిగా రణబీర్ కపూర్, సీతా దేవిగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణ్‌గా యష్ న‌టిస్తున్నారు. ఇత‌ర తారాగ‌ణం గురించి ఇప్ప‌టికే క‌థ‌నాలొచ్చాయి. రామాయ‌ణం క‌థ‌ను మూడు భాగాలుగా నితీష్ జీ తెర‌కెక్కించ‌నున్నారు. అయితే ఇలా ఆరంభ‌మే తార‌ల ఫోటోలు సెట్స్ నుంచి లీకైపోతుంటే పాత్ర‌ల విష‌యంలో స‌స్పెన్స్ వీడిపోతుంది. సినిమాపై క్యూరియాసిటీ పెర‌గాలంటే కొన్నిటిని దాచేయాలి. అధికారికంగానే రిలీజ్ చేస్తే ఆ కిక్కు వేరు. కానీ నితీష్ ఈ విష‌యంలో వెన‌క‌బ‌డి ఉన్నారు. సెట్ నుంచి లీకుల‌కు ఆయ‌న అడ్డుకట్ట వేయ‌లేక‌పోతున్నారు. రాజ‌మౌళి, శంక‌ర్ లా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు ఆయ‌న‌. దాదాపు 1000 కోట్ల బ‌డ్జెట్ తో రూపొంద‌నున్న భారీ ఫ్రాంఛైజీ చిత్రాలకు లీకేజీలు పెద్ద డ్యామేజీగా మార‌డం అంత‌గా మంచిది కాదు. జాగ్ర‌త్త ప‌డాల‌ని కూడా అనుభ‌వ‌జ్ఞులు సూచిస్తున్నారు.