రామాయణం రిలీజ్ కు ముందే రెండో భాగం!
సాధారణంగా ఇలాంటి భారీ ప్రాజెక్ట్ విషయంలో షూటింగ్ మొదలైన తర్వాత వేగంగా నిర్వహించడం అన్నది అంత సులభం కాదు.
By: Tupaki Desk | 19 April 2025 9:30 AMబాలీవుడ్ లో రామాయణం షూటింగ్ శర వేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. నితీష్ తివారీ దర్శకత్వం లో మొదలైన ప్రాజెక్ట్ ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా వేగంగా పూర్తి చేస్తున్నారు. నటీనటులు, టెక్నిషీయన్లు అన్ని రకాలుగా సహకరిచడంతో? నితీష్ కి ఆన్ సెట్స్ లో పని ఈజీగా వేగంగా అవుతుంది. సాధారణంగా ఇలాంటి భారీ ప్రాజెక్ట్ విషయంలో షూటింగ్ మొదలైన తర్వాత వేగంగా నిర్వహించడం అన్నది అంత సులభం కాదు.
రకరకాల సవాళ్లు ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో ప్రతీ కొత్త షెడ్యూళ్లు ప్రారంభానికి ముందు కొంత గ్యాప్ తీసుకుంటారు. అవసరం అనుకుంటే అప్పటికప్పుడు వర్క్ షాప్స్ నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో వేసుకున్న షెడ్యూల్స్ కి అంతరాయం ఏర్పడుతుంది. కానీ నితీష్ తివారీ మాత్రం పక్కా ప్లానింగ్ తో బరిలోకి దిగి ముగిస్తున్నారు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. అప్పుడే మొదటి భాగం `రామాయణం` షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లు తెలిసింది.
దీంతో రెండవ భాగం షూటింగ్ మే నెలఖరు నుంచి ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో తొలి భాగం షూట్ కంప్లీట్ అవుతుంది. అనంతరం యూనిట్ కొంత విరామం తీసుకుంటుంది. అటుపై రెండవ భాగం పట్టాలెక్కించాలని నితీష్ తివారీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో సీత పాత్రకు సంబంధించి అశోకవనం ఎపిసోడ్స్ చిత్రీకరిస్తారు. జూన్ నుంచి రణబీర్ కపూర్ పై రాముడి సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం.
ఇద్దరి కాంబినేషన్ లో రెండు పాటలు కూడా చిత్రీకరిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా కోట్ల రూపాయలు వెచ్చించి రెండు భారీ సెట్లు సిద్దం చేస్తున్నారు. మొదటి భాగం 2026 దివాలీ సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి తొలి భాగానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతాయి. అలాగే రెండవ భాగం 2027 దివాలీకి రిలీజ్ ఉంటుంది.