Begin typing your search above and press return to search.

నిత్యా మీనన్..అటు పెళ్లి.. ఇటు ఎక్స్ ఫోన్

అయితే హీరోయిన్ రోల్ కు మంచి స్కోప్ ఉన్న సినిమాలనే చేస్తోంది నిత్యా మీనన్.

By:  Tupaki Desk   |   8 April 2024 12:51 PM GMT
నిత్యా మీనన్..అటు పెళ్లి.. ఇటు ఎక్స్ ఫోన్
X

సౌత్ సినీ ఇండస్ట్రీలో అందాల భామ నిత్యా మీనన్ కు స్పెషల్ ఇమేజ్ ఉన్న విషయం తెలిసిందే. చైల్ట్ ఆర్టిస్ట్ గా కెరీర్ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. తెలుగులో ఫస్ట్ మూవీ అలా మొదలైందితో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు సాధించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.

అయితే హీరోయిన్ రోల్ కు మంచి స్కోప్ ఉన్న సినిమాలనే చేస్తోంది నిత్యా మీనన్. మిషన్ మంగళ్ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్, తిరు సినిమాలతో హిట్ ట్రాక్ ఎక్కేసింది. భీమ్లా నాయక్ లో పవన్ భార్యగా నటించి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. నేడు నిత్యా మీనన్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తోపాటు సినీ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు.

ఇక.. నిత్యా మీనన్ బర్త్ డే స్పెషల్ గా ఆమె ప్రస్తుతం నటిస్తున్న డియర్ ఎక్స్ మూవీ మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఆమె ఫస్ట్ లుక్ ను సోమవారం రిలీజ్ చేశారు. బర్త్ డే విషెస్ కూడా తెలిపారు. ఈ సినిమాను కోలీవుడ్ దర్శకురాలు కామిని తెరకెక్కిస్తున్నారు. బాస్క్ టైమ్ థియేటర్, పోప్టర్ మీడియా నెట్వర్క్ బ్యాన‌ర్ల పై బీజీఎన్, ఆదిత్య అజయ్ సింగ్, రామ్కి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిత్య ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.

పెళ్లి కూతురు గెటప్ లో ఉన్న నిత్యా మీనన్.. ఓ చేతిలో డ్రింక్, మరో చేతిలో ఫోన్ పట్టుకుని ఉంది. తనకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తున్నట్లు ఫోన్ లో కనిపిస్తోంది. మొత్తానికి ఈ సినిమా మంచి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు పోస్టర్ చూస్తుంటే అర్ధమవుతోంది. ఈ చిత్రంలో నిత్యా మీనన్ తోపాటు నటులు విన‌య్ రాయ్, న‌వ‌దీప్, ప్ర‌తీక్ బబ్బ‌ర్, దీప‌క్ ప‌రంబోల్ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఇక నిత్య ఈ సినిమాతోపాటు ధనుష్ తో మరో చిత్రం చేస్తోంది. రాయన్ సినిమాలో ఆయనకు జోడీగా నటిస్తోంది. ఇటీవల ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తెలుగులో శ్రీమతి కుమారి వెబ్ సిరీస్ తో మంచి సక్సెస్ అందుకుంది. తమిళంలో మాస్టర్ పీస్ సిరీస్ లో తన నటనతో అలరించింది. మరి నిత్యా మీనన్.. తన కొత్త మూవీలతో ఎలాంటి హిట్లు అందుకుంటుందో చూడాలి.