Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : వాలు జడ.. మల్లెపూల జడ..!

బారు జడ.. మల్లెపూలతో బుట్ట బొమ్మని తలపిస్తుంది నిత్యా మీనన్. ఈ ఫోటో చూసిన వారంతా కూడా వాలు జడ మల్లె పూల జడ అని పాటేసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   27 Sep 2023 3:30 AM GMT
ఫోటో స్టోరీ : వాలు జడ.. మల్లెపూల జడ..!
X

మలయాళ భామల్లో తెలుగు తెర మీద తమ అభినయాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల మనసు గెలిచిన వారిలో నిత్యా మీనన్ ఒకరు. అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిత్యా మీనన్ ఆ సినిమా నుంచి ఏ పాత్ర చేసినా తన సహజ నటనతో మెప్పిస్తూ వస్తున్నారు. యువ హీరోలందరితో నటించిన నిత్యా మీనన్ ప్రతి సినిమాలో తన మార్క్ చూపిస్తూ వస్తుంది.


కొన్నాళ్లు కెరీర్ లో వెనక పడినట్టు అనిపించినా తనకు వచ్చిన ఛాన్స్ ని అసలు వదలకుండా చేస్తూ వస్తుంది. లేటెస్ట్ గా కుమారి శ్రీమతి సినిమాతో డిజిటల్ ఎంట్రీ ఇస్తుంది నిత్యా మీనన్. వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన కుమారి శ్రీమతి సినిమాలో నిత్యా మీనన్ మరోసారి తన సత్తా చాటనుంది. ఈ సినిమా మరో రెండు రోజుల్లో అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది.

ఇదిలా ఉంటే లేటెస్ట్ గా నిత్య ఒక స్పెషల్ ఫోటో షూట్ తో సర్ ప్రైజ్ చేసింది. బారు జడ.. మల్లెపూలతో బుట్ట బొమ్మని తలపిస్తుంది నిత్యా మీనన్. ఈ ఫోటో చూసిన వారంతా కూడా వాలు జడ మల్లె పూల జడ అని పాటేసుకుంటున్నారు. అందంగా ముస్తాబయ్యి.. తన రాకుమారుడి కోసం ఎదురుచూస్తున్న రాజకుమారిగా ఉంది నిత్యా మీనన్. నిత్యా లేటెస్ట్ ఫోటో షూట్ ఆమె ఫ్యాన్స్ ని అలరిస్తుంది. కుమారి శ్రీమతి సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సినిమా కూడా ఓటీటీ ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని చెప్పొచ్చు. తను ఎంచుకున్న పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు.

అందుకే ఆమె సెలెక్టెడ్ సినిమాలు చేస్తుంది. చాలా సినిమాలు కథ నచ్చక.. సినిమాలో ఆమె పాత్ర ప్రాధాన్యత లేక కాదనుకుందని తెలుస్తుంది. అయితే కొన్ని సినిమాల్లో మాత్రం క్యామియో రోల్స్ కూడా చేసింది. తనకు నచ్చిన పనిని నచ్చినట్టుగా చేస్తూ తన ఫ్యాన్స్ ని కూడా మెప్పిస్తున్న నిత్యా మీనన్ ఈమధ్య కొద్దిగా ఫాం తగ్గినట్టు అనిపించినా తప్పకుండా రానున్న ప్రాజెక్ట్ లతో సత్తా చాటుతుందని చెప్పొచ్చు.

తెలుగు తమిళ భాషల్లో తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ సెట్ చేసుకున్న నిత్యా మళ్లీ ఫాంలోకి వచ్చే ప్రయత్నంలో ఏ అవకాశాన్ని వదలుకోకూడదని ఫిక్స్ అయ్యింది. నిత్యా ఈ డెశిషన్ ఆమె ఫ్యాన్స్ ని ఖుషి అయ్యేలా చేస్తుంది.