Begin typing your search above and press return to search.

ఫాంటసీ వరల్డ్‌ కి తీసుకెళ్లనున్న నిత్య..!

కెరీర్‌ ఆరంభం నుంచి కూడా స్కిన్‌ షో చేయకుండానే నిత్యా మీనన్ సినిమాలు చేస్తూ వచ్చింది.

By:  Tupaki Desk   |   16 March 2024 5:48 AM GMT
ఫాంటసీ వరల్డ్‌ కి తీసుకెళ్లనున్న నిత్య..!
X

సౌత్ హీరోయిన్స్ లో ఎక్కువ శాతం స్కిన్‌ షో చేయడం ద్వారా గుర్తింపు దక్కించుకున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే నటనతో మెప్పించి స్టార్‌ డమ్‌ ను దక్కించుకున్నారు. అందులో నిత్యా మీనన్ ఒకరు అనడంలో సందేహం లేదు. కెరీర్‌ ఆరంభం నుంచి కూడా స్కిన్‌ షో చేయకుండానే నిత్యా మీనన్ సినిమాలు చేస్తూ వచ్చింది.

నటనతో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ నిత్య మీనన్ కమర్షియల్‌ పాత్రల కంటే ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడి జోరు కాస్త తగ్గిందని చెప్పాలి. తాజాగా ఈ అమ్మడు కొత్త సినిమాకు కమిట్ అయ్యింది.

ఫాంటసీ కాన్సెప్ట్‌ తో రూపొందుతున్న ఈ సినిమాలో నిత్యా మీనన్ ను కొత్తగా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు విష్ణువర్ధన్ శిష్యురాలు అయిన కామిని ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతుంది. దర్శకురాలిగా కామిని మొదటి ప్రయత్నంలోనే వినూత్న ప్రాజెక్ట్‌ ను ఎంపిక చేసుకుంది.

నిత్యా మీనన్ తో పాటు ఈ ఫాంటసీ సినిమాలో వినయ్ రాయ్‌, నవదీప్, ప్రతీక్‌, దీపక్ లు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతున్న ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలో వెళ్లడించే అవకాశం ఉంది.