Begin typing your search above and press return to search.

4 సార్లు పెళ్లికి సిద్ధ‌మై చివ‌ర్లో వెన‌క్కి త‌గ్గాను: నిత్యామీన‌న్

తాను నాలుగుసార్లు పెళ్లి ద‌శ వ‌ర‌కూ వ‌చ్చి, చివ‌రిలో వెన‌క్కి త‌గ్గాన‌ని చెప్పారు నిత్యా మీన‌న్.

By:  Tupaki Desk   |   25 July 2025 9:29 AM IST
4 సార్లు పెళ్లికి సిద్ధ‌మై చివ‌ర్లో వెన‌క్కి త‌గ్గాను: నిత్యామీన‌న్
X

తాను నాలుగుసార్లు పెళ్లి ద‌శ వ‌ర‌కూ వ‌చ్చి, చివ‌రిలో వెన‌క్కి త‌గ్గాన‌ని చెప్పారు నిత్యా మీన‌న్. ప్ర‌తిసారీ ల‌వ్ బ్రేక్ అయింద‌ని అన్నారు. ఇప్పుడు వివాహం అనేది త‌న‌ ప్రాధాన్యత కాదని, సామాజిక అంచనాలు, ఒత్తిడి నుండి విముక్తి పొందాన‌ని, సాంప్రదాయ ప్రేమ సంబంధాల వెలుపల ఆనంద‌క‌ర‌ జీవితంతో సంతృప్తి చెందుతాన‌ని నిత్యా తెలిపింది.

ప్రేమ పేరుతో ఎదురు దెబ్బ‌లు తిన్నానని, భావోద్వేగంతో కూడుకున్న దెబ్బ‌లు ఇవి అని నిత్యా మీన‌న్ వెల్ల‌డించింది. అయితే ప్ర‌తిసారీ ఇలాంటి అనుభ‌వాలు నా దృక్ప‌థాన్ని మార్చాయ‌ని అన్నారు. యువ‌త పెళ్లి చేసుకోవాల‌ని చెప్పే పెద్ద‌ల‌ను అర్థం చేసుకోగ‌ల‌ను.. అయితే నేను దానికి నైతిక ప్రాముఖ్యతను ఇవ్వడం లేదని అన్నారు. తాను ఎప్పుడూ ఒంటరి వ్యక్తినని, ఒక‌రితో సమయం గడపడం అనే భావన తనను ఎప్పుడూ బెదిరించలేదని కూడా అంది. నా రిలేష‌న్ షిప్స్ అన్నీ విచార‌క‌రంగా ముగిసాయ‌ని కూడా చెప్పింది నిత్యా. వ్య‌క్తిగ‌తంగా ప్రేమ‌లో దెబ్బ‌లు తిన్న త‌ర్వాత నేను ఉందో లేదో తెలీని ప్రేమ గురించి వెతుకుతున్నానా? అని భావించిన‌ట్టు నిత్యా తెలిపారు.

నాతో సంబంధంలో ఉన్న భాగ‌స్వామి న‌న్ను దోపిడీ చేయ‌డానికి ప్రయ‌త్నించార‌ని నిత్యా వెల్ల‌డించింది. వివాహం చేసుకునే విషయంలో తనకు ఎటువంటి అత్యవసరం లేదని కూడా నిత్య చెప్పింది. త‌న‌కు ఓ తోడు దొరికితే త‌ల్లిదండ్రులు సంతోషిస్తార‌ని, కానీ త‌న ఆలోచ‌న‌ల‌కు వారి మ‌ద్ధ‌తు ఉంద‌ని తెలిపింది. అమ్మ‌మ్మ జీవించి ఉన్న‌ప్పుడు పెళ్లి చేసుకోవాల‌ని చాలా ఒత్తిడి చేసేది. స్టార్ డ‌మ్ తో సంబంధం లేకుండా త‌న ఆలోచ‌న అలా ఉండేది. కానీ ఇప్పుడు నేను అన్ని ర‌కాల సామాజిక అంచ‌నాల నుంచి విముక్తి పొందాను. అమ్మా నాన్న నా స్వ‌యం ఎదుగుద‌ల‌ను, ఆలోచ‌న‌ల‌ను అర్థం చేసుకుని గౌర‌విస్తున్నారు. ఒంటరిగా ఉండటం అసంపూర్ణంగా ఉండటమేనని అర్థం చేసుకున్నాను అని కూడా నిత్యా చెప్పింది. ర‌త‌న్ టాటా వంటి ప్ర‌ముఖుడు శృంగార సంబంధాల‌తో ప‌ని లేకుండా ఆనందంగా జీవించార‌ని, పెళ్లి త‌న‌కు ప్రాధాన్య‌త కాద‌ని కూడా నిత్యా వెల్ల‌డించింది.

2011లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో ``నేను నాలుగుసార్లు వివాహం చేసుకునే వ‌ర‌కూ వచ్చాను.. ప్రతిసారీ భయంతో లేదా మరొక కారణంతో వెనక్కి తగ్గాను`` అని నిత్యా పేర్కొన్నారు.