Begin typing your search above and press return to search.

పుష్ప వచ్చాడు.. తమ్ముడు వెళ్లాడు!

గత కొన్ని రోజులుగా నితిన్ 'తమ్ముడు' చాలా సైలెంట్ గా ఉన్నాడు. ఎట్టకేలకు సినిమాకు సంబంధించిన వార్త ఒకటి మీడియా వర్గాలకు చేరింది.

By:  Tupaki Desk   |   13 March 2024 9:42 AM GMT
పుష్ప వచ్చాడు.. తమ్ముడు వెళ్లాడు!
X

హీరో నితిన్ కి ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాతో కూడా నిరాశే మిగిలింది. సక్సెస్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న నితిన్ చాలా నమ్మకం పెట్టుకుని ప్రస్తుతం చేస్తున్న సినిమా 'తమ్ముడు'. టైటిల్‌ ప్రకటించినప్పటి నుంచి కూడా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతూ వస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ హిట్‌ చిత్రాల్లో ఒకటి తమ్ముడు. ఇప్పుడు అదే టైటిల్ తో పవన్‌ కి వీరాభిమాని అంటూ చెప్పుకునే నితిన్ సినిమా చేస్తుండటంతో అందరి దృష్టి ఈ సినిమా పై ఉంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

గత కొన్ని రోజులుగా నితిన్ 'తమ్ముడు' చాలా సైలెంట్ గా ఉన్నాడు. ఎట్టకేలకు సినిమాకు సంబంధించిన వార్త ఒకటి మీడియా వర్గాలకు చేరింది. రేపటి నుంచి వైజాగ్ లో కొత్త షెడ్యూల్‌ ను ప్రారంభించేందుకు ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా అక్కడికి చేరుకున్నారు.

వైజాగ్ షెడ్యూల్‌ ను దాదాపుగా రెండు వారాల పాటు ప్లాన్‌ చేసినట్లుగా సమాచారం అందుతోంది. కీలక టాకీ పార్ట్‌ తో పాటు ఒక యాక్షన్‌ సన్నివేశాన్ని కూడా అక్కడ చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతోంది. పుష్ప 2 యూనిట్‌ సభ్యులు వైజాగ్ షెడ్యూల్‌ క్యాన్సిల్‌ చేసుకుని వచ్చిన తదుపరి రోజే 'తమ్ముడు' అక్కడిక వెళ్లడం కాకతాళీయం.